Short News

నిలకడగా భారత్ బ్యాటింగ్, రోహిత్  సెంచరీ

నిలకడగా భారత్ బ్యాటింగ్, రోహిత్ సెంచరీ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో రోహిత్ పరుగుల వర్షం కురిపించాడు. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ బంతులను బౌండరీలు దాటించి  107 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. ఇప్పటివరకూ జరిగిన ఓవరాల్‌ సిరీస్‌లో తీవ్రంగా నిరాశపరిచిన రోహిత్‌ ఐదో వన్డేలో మాత్రం ఎట్టకేలకు సెంచరీ చేసి తన సత్తా చాటాడు. 10 ఫోర్లు , 4 సిక్సర్లు బాదాడు. శిఖర్‌ ధావన్‌, కోహ్లీ అవుట్ అయిన తర్వాత రోహిత్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ సెంచరీ సాధించాడు
గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న రద్దైంది అందుకేనా?

గ‌వ‌ర్న‌ర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న రద్దైంది అందుకేనా?

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఢిల్లీ పర్యటనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయ‌న ప్ర‌ధాని, హోం మంత్రితోపాటు ఇత‌ర కేంద్ర మంత్రులను కలవాల్సిఉంది. ఈ మేరకు అపాయింట్‌మెంట్లు కూడా ఖరారయ్యాయి. కానీ అనూహ్య రీతిలో గవర్నర్‌ తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న ఆయన బుధవారం ఉదయానికి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. గవర్నర్‌ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పర్యటనల రద్దు వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.   
చెత్తగా ఆడాం ..ముమ్మాటికీ తప్పు మాదే

చెత్తగా ఆడాం ..ముమ్మాటికీ తప్పు మాదే

టీ20 లీగ్ 2018లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయంపై ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఐపీఎల్‌ చరిత్రలో చెత్తరికార్డును నమోదుచేసిన ముంబై 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన నేపధ్యంలో రోహిత్ మాట్లాడుతూ 'ఓడిపోయినందుకు మమ్మల్ని మేము నిందించుకోవాల్సిందే. పిచ్‌ స్వభావం ఎలాంటిదైనా కావచ్చు. ఇంత చిన్న(118 పరుగుల) లక్ష్యాన్ని సునాయాసంగా ఛేధింగల సత్తా మా జట్టుకు ఉంది. బౌలర్లు అద్భుతంగా రాణించినా, బ్యాట్స్‌మన్లు దారుణంగా విఫలమయ్యారు. వ్యక్తిగతంగా నేను కూడా చెత్తగా ఆడానని చెప్పక తప్పదు' అని చెప్పాడు. 
భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌

భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌

దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తన టవర్‌ యూనిట్‌ను ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌తో విలీనం చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 10.8 బిలియన్‌ డాలర్లు(రూ.71,500 కోట్లు). ఈ ఒప్పందంలో ప్రతి ఇండస్ టవర్ వాటాకి 1,565 షేర్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు భారతి ఎయిర్‌టెల్‌ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. తాజా డీల్‌తో చైనా వెలుపల భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌ ఆవిర్భవిస్తుంది. విలీనం తరువాత ఉమ్మడి సంస్థ ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌గా కొనసాగనుంది.