Short News

ప్ర‌పంచ క‌ప్ కోసం న‌వ్వ‌డమూ నేర్పిస్తున్నారు!

ప్ర‌పంచ క‌ప్ కోసం న‌వ్వ‌డమూ నేర్పిస్తున్నారు!

ఫిఫా ప్రపంచకప్‌ గొప్పగా నిర్వహించి ప్రపంచానికి సత్తా చాటాలని పట్టుదలతో ఉంది రష్యా. ఆటగాళ్లు, అభిమానులకు ఇబ్బంది తలెత్తకుండా అత్యున్నత స్థాయి వసతులు కల్పించడంపై దృష్టి పెట్టారు. ప్రపంచ కప్‌ కోసం పని చేసే కార్మికులు, వలంటీర్లలో సానుకూల దృక్పథాన్ని అలవరిచే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అతిథులతో మర్యాదపూర్వకంగా ఎలా ప్రవర్తించాలో చెబుతూ.. ఇంగ్లిష్‌లో చక్కటి పదాలు అలవాటు చేస్తున్నారు. ఆహ్లాదకరంగా నవ్వడమూ నేర్పిస్తున్నారు. రష్యా పట్ల ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని మార్చాలన్న ఉద్దేశం అధికారుల్లో బలంగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.    
'రెండు నెల‌ల్లో కింభో యాప్ తీసుకొస్తాం'

'రెండు నెల‌ల్లో కింభో యాప్ తీసుకొస్తాం'

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా ఇటీవల పతంజలి తీసుకొచ్చిన స్వదేశీ మెసేజింగ్ యాప్ కింభో.. ఒక్క రోజులోనే తెరమరుగైంది. తాజాగా బాబా రాందేవ్ మాట్లాడుతూ కింభో యాప్ మరో రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. కింభో యాప్ టెస్టింగ్ దశలోనే భారీగా ట్రాఫిక్‌ను ఎదుర్కొందని చెప్పారు. ప్రస్తుతం ఇది పైలట్ దశలో ఉందని, యూజర్ ట్రాఫిక్‌ను ఎలా నిర్వహించాలో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మరో రెండు నెలల్లో అధికారికంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఈ యాప్‌ గురించి అధికారికంగా వెల్లడించింది.    
కొత్త ఉత్ప‌త్తులు విడుద‌ల చేసిన కోకాకోలా

కొత్త ఉత్ప‌త్తులు విడుద‌ల చేసిన కోకాకోలా

కోకాకోలా ఇండియా.. హైడ్రేషన్‌, న్యూట్రిషియస్‌ డైల్యుటబుల్స్‌ విభాగాల్లోకి అడుగుపెట్టింది. ఆక్వేరియస్‌ గ్లూకోచార్జ్‌, మినిట్‌మెయిడ్‌ వింటిగో ఉత్పత్తులను విడుదల చేసింది. శుక్రవారం నాడు ఈ ఉత్పత్తులను కోకాకోలా ఇండియా ప్రెసిడెంట్‌ టి కృష్ణకుమార్‌ మార్కెట్లోకి విడుదల చేశారు. మినరల్స్‌తో కూడిన గ్లూకోజ్‌, ఫ్రూట్‌ జ్యూస్‌ను భారత వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు కోకాకోలా తెలిపింది. విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, జింక్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి2, బి12 పోషకాలతో మినిట్‌ మెయిడ్‌ వింటిగోను తీసుకువచ్చినట్లు తెలిపింది.     
త్వ‌ర‌లో జ‌న‌సేన రాజ‌కీయ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు

త్వ‌ర‌లో జ‌న‌సేన రాజ‌కీయ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు

జనసేన కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలపై ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ట్వీట్ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో బూత్‌స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు ఉంటాయన్నారు. పోరాటం చేసే వారికి తెగువతో పాటు సమర్థత, విషయ పరిజ్ఞానం ఉండాలని సూచించారు. శాసించేవారు కాదు... ప్రజలను ప్రేమించేవారే నాయకులని పవన్ అన్నారు. భావి తరాలకు నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థను అందించాలని పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more