Short News

డివైడ‌రే స్టంప్స్ గా చేసుకుని స‌చిన్ బ్యాటింగ్‌!

డివైడ‌రే స్టంప్స్ గా చేసుకుని స‌చిన్ బ్యాటింగ్‌!

ఇండియాలో క్రికెట్ అంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరు చాలా మందికి గుర్తుకు వ‌స్తుంది. ఆట‌కు అత‌డు రిటైర్మెంట్ ప్రకటించినా టీ20 లీగ్ లో ముంబయి జ‌ట్ట‌కు మార్గ నిర్దేశనం చేస్తూ ఇంకా క్రికెట్ ఆటతోనే అనుబంధం కొనసాగిస్తున్నాడు. తాజాగా సచిన్ ముంబయిలోని ఓ వీధిలో కొంతమంది యువకులతో కలిసి క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏదో రహదారిపై రాత్రివేళ పక్క నుంచి వాహనాలు వెళ్తున్నా కూడా ప్లాస్టిక్ డివైడర్‌ను స్టంప్‌లుగా చేసుకొని సచిన్ బ్యాటింగ్ చేశాడు.   
కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

గుంటూరు:వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిష్ట అడుగంటుతున్న నేపథ్యంలో తమ రాజకీయ మనుగడ దృష్ట్యా పలు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బైటపడేందుకు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరేందుకు సర్వ సన్నద్దం అయినట్లు సమాచారం.

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో 2018-19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 28 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలను జూన్‌4లోపు పంపించాలి. ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్‌ 11న ప్రకటించి, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.  
కొరటాల నెక్స్ట్ మూవీపై పెరుగుతున్న ఆసక్తి.. హీరో అతడేనా!

కొరటాల నెక్స్ట్ మూవీపై పెరుగుతున్న ఆసక్తి.. హీరో అతడేనా!

వరుసగా నాలుగు విజయాలు సాధించితిన దర్శకుడు, హీరోలు ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో వరుసగా నాలుగు బ్లాక్ బాస్టర్ అందుకున్న దర్శకుడు ఎవరంటే వెంటనే కొరటాల శివ పేరు గుర్తుకు వస్తుంది. రొటీన్ కమర్షియల్ చిత్రాల తరహాలో కాకుండా.. కమర్షియల్ అంశాలు ఉంటూనే సందేశాన్ని ఇవ్వడం కొరటాల స్టైల్ అని అర్థం అయిపోయింది. తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకుంటున్న కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. దీనితో కొరటాల నెక్స్ట్ మూవీ ఎవరితో అనే ఆసక్తి అందరిలో ఎక్కువైపోతోంది.