Short News

శ్రీలంకతో తొలి టెస్టు ..కుప్పకూలిన సఫారీలు

శ్రీలంకతో తొలి టెస్టు ..కుప్పకూలిన సఫారీలు

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు తడబడుతోంది. శ్రీలంక బౌలర్ల ధాటిక సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌటైంది. వికెట్‌ నష్టానికి నాలుగు పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ (49) ఒంటరి పోరాటం చేయడంతో వంద పరుగుల మార్క్‌ను దాటింది. అనంతరం 161 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 111 పరుగులు సాధించింది. శ్రీలంక ప్రస్తుతం 272 పరుగుల ఆధిక్యంలో ఉంది.
'గాలె' స్టేడియాన్ని కూల్చుతున్న శ్రీలంక ప్రభుత్వం

'గాలె' స్టేడియాన్ని కూల్చుతున్న శ్రీలంక ప్రభుత్వం

శ్రీలంకలోని గాలె అంతర్జాతీయ స్టేడియం 2004 డిసెంబర్‌లో వచ్చిన సునామీకి దెబ్బతింది. అనంతరం మరమ్మత్తులు చేసారు. ఈ స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్‌ను కూల్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. పెవిలియన్ స్టాండ్ వల్ల స్టేడియానికి ఆనుకొని ఉన్న డచ్‌ఫోర్ట్‌ గోడ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ డచ్ ఫోర్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణ కొలంబోకు 115 కిలోమీటర్ల దూరంలో మరొక స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 
సరికొత్త డిజైన్‌లో గూగుల్ సెర్చ్ యాప్

సరికొత్త డిజైన్‌లో గూగుల్ సెర్చ్ యాప్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరింత కొత్తదనాన్ని పంచే క్రమంలో సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన మొబైల్ సెర్చ్ యాప్‌ను పూర్తిగా రీడిజైన్ చేసే ప్రయత్నం చేస్తోంది. డీపర్ ఇంప్లిమెంటేషన్‌తో కనిపిస్తోన్నఈ రీడిజైన్ ప్రాసెస్ సరికొత్త మెటీరియల్ డిజైన్‌ను తెరపైకి తీసుకువచ్చేలా ఉంది. ప్రస్తుతానికి టెస్టింగ్ ప్రాసెస్‌లో ఉన్న ఈ అప్‌డేట్ ఎప్పుటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.

చికాగోలో అమ్ముతున్న శివుడి బొమ్మలపై హిందువుల ఆందోళన

చికాగోలో అమ్ముతున్న శివుడి బొమ్మలపై హిందువుల ఆందోళన

చికాగోలోని 'ఫీల్డ్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ' షోరూంలో విక్రయిస్తున్న శివుని బొమ్మలపై హిందూసంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. శివుని బొమ్మలు పిల్లలు ఆడుకునే సాప్ట్‌టాయిస్ మాదిరిగా ఉండటంతో అమ్మకాన్ని నిలిపివేయాలని, దుకాణం నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. వీరి డిమాండ్లకు తలొగ్గిన స్టోర్ యజమాని శివుని బొమ్మల విక్రయాన్ని నిలిపివేసారు. మ్యూజియం ప్రతినిధి జాకెల్ జాన్స్‌టన్ మాట్లాడుతూ ఫీల్డ్ మ్యూజియం అన్ని మతాలను, సంస్కృతులను గౌరవిస్తుందన్నారు. వివాదాస్పదంగా మారిన శివుని బొమ్మలను వెంటనే తొలగిస్తున్నామని తెలిపారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more