Short News

లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేసిన టీమ్ ఇండియా

లార్డ్స్‌లో ప్రాక్టీస్ చేసిన టీమ్ ఇండియా

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు కోసం కోహ్లీ సేన లార్డ్స్‌ చేరుకుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆటగాళ్లు లార్డ్స్‌ మైదానంలో ప్రాక్టీస్‌ చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ నిర్వాహకులు ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. కోచ్‌ రవిశాష్ట్రి పిచ్‌ను పరిశీలించాడు. అలాగే పిచ్‌ గురించి క్యూరేటర్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఆటగాళ్లందరూ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ప్రాక్టీస్‌ చేశారు. అలాగే ఫీల్డింగ్‌పై జట్టు ప్రత్యేక దృష్టి పెట్టింది. కుల్‌దీప్‌ యాదవ్‌ ప్రాక్టీస్‌ సెషన్లో కనిపించడంతో రెండో టెస్టులో అతడికి చోటు దక్కుతుందేమోనని అభిమానులు అనుకుంటున్నారు.   
స్వలింగ సంపర్కం: ఇద్దరు మహిళలకు కొరడా దెబ్బలు..భారీ జరిమానా

స్వలింగ సంపర్కం: ఇద్దరు మహిళలకు కొరడా దెబ్బలు..భారీ జరిమానా

స్వలింగ సంపర్కం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముస్లిం మహిళలను కోర్టు దోషులుగా తేల్చింది. ఒక్కొక్కరికి ఆరు కొరడా దెబ్బలు, 56 వేల రూపాయల చొప్పున జరిమానా విధించింది. ఈ సంఘటన మలేషియాలో తెరంగను రాష్ర్టంలో మంగళవారం చోటుచేసుకుంది. 32, 22 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలు గత ఏప్రిల్‌లో స్వలింగ సంపర్కానికి ఒడిగట్టారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ముహమద్‌ ఖాస్మీజాన్‌ అబ్దుల్లా మీడియాకు వెల్లడించారు. షరియా చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కం నేరమని తెలిపారు. స్వలింగ సంపర్కానికి సంబంధించి తెరంగను రాష్ర్టంలో ఇదే తొలి తీర్పు అని తెలిపారు.
సీఎం చేతులు పట్టుకొని అడిగా: మెరీనా బీచ్‌పై స్టాలిన్

సీఎం చేతులు పట్టుకొని అడిగా: మెరీనా బీచ్‌పై స్టాలిన్

మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించక పోయి ఉంటే ఆయనతో పాటు తాను కూడా సమాధి అయి ఉండేవాడినని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరుణానిధి వంటి గొప్ప నేతను పార్టీ కోల్పోతే, తాను తండ్రిని కోల్పోయానని చెప్పారు. కరుణానిధి ఆశయాల కోసం కార్యకర్తలు అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మెరీనా బీచ్‌లో కరుణానిధి సమాధి ఏర్పాటు చేయాలన్న తన తండ్రి చివరి కోరికను ముఖ్యమంత్రి పళనిస్వామికి చెప్పానని, కానీ దానిని ఆయన తోసిపుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

తండ్రిగా నేను నా కూతళ్ల పట్ల భయపడుతున్నా

తండ్రిగా నేను నా కూతళ్ల పట్ల భయపడుతున్నా

ఓ తండ్రిగా చింతిస్తున్నానని విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ చెప్పారు. ఓ తండ్రిగా నేను వాళ్ల పట్ల భయపడుతున్నా. ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలే. అలాంటివి జరిగిన ప్రతి సారీ నేను వాళ్ల గురించి బాధపడాలా?'.‘ఈ సమాజాన్ని బాగు చేయాలి అనుకుంటున్నా. ప్రపంచంలో ఏం జరిగినా ఎదుర్కోవడానికి నా కుమార్తెలు సిద్ధంగా ఉన్నారు. మన సమాజం మారాలి. ప్రతి ఘటనకు మన కుమార్తెల్ని నిందించలేం, వారి స్వేచ్ఛను లాక్కోలేం. వాళ్లు స్వేచ్ఛగా జీవించాలని పేర్కొన్నారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more