Short News

భారత్, సౌతాఫ్రికా ఐదో వన్డే 'నేడే'

భారత్, సౌతాఫ్రికా ఐదో వన్డే 'నేడే'

భారత్, దక్షిణాఫ్రికాల మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. వరుస విజయాలతో ఉన్న కోహ్లీ సేన నాలుగో వన్డేలో అనూహ్యంగా ఓడిపోయింది. ఒక్కసారిగా గెలుపుతో సిరీస్ పై కొంతమేరకు ఆశలు నిలుపుకున్న సౌతాఫ్రికా మరింత పట్టు బిగించాలని చూస్తోంది. సఫారీలను  చిత్తు చేసి చరిత్ర సృష్టించాలని టీమిండియా తహతహలాడుతోంది. పోర్ట్‌ ఎలిజబెత్‌లో ఇరుజట్ల మధ్య ఐదో వన్డే నేడే జరగనుంది. ఈ మైదానంలో భారత్ ఇప్పడివరకూ ఆడిన నాలుగు మ్యాచ్ లలో ఓడిపోయింది.
అవిశ్వాసంతో ప్రయోజనం లేదన్న చంద్రబాబు

అవిశ్వాసంతో ప్రయోజనం లేదన్న చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ఏపీలో పోలిటికల్ హీట్ పెరుగుతోంది. ఆవిశ్వాసం పెడితే టీడీపీకి మద్దతిస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. మరోవైపు  అవిశ్వాసం కోసం తాను కూడా  ఎంపీల మద్దతు కూడగడతానని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాన్. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు అవిశ్వాసంతో ఉపయోగం లేదని తేల్చిచెప్పారు. అన్ని ప్రయత్నాలు ముగిసిన తర్వాత చివరి ప్రయత్నంగా మాత్రమే ఉండాలన్నారు.
లేటుగా వచ్చిన పైలట్, బయటకు చెప్తే విమానం పేల్చేస్తా

లేటుగా వచ్చిన పైలట్, బయటకు చెప్తే విమానం పేల్చేస్తా

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గోఎయిర్ సంస్థకు చెందిన జీ8 113 విమానం ఉదయం 5.50కి బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులు వచ్చినా పైలట్లు 7గంటల వరకు పైలట్లు విమానం వద్దకు రాలేదు. కనీసం విమానం కదులుతుందో లేదో తెలియక కొందరు ప్రయాణికులు కేకలు వేశారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న కొందరు వారిని వీడియో తీశారు. పైలట్లు వద్దని చెబుతున్నా సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బెదరించారు. వీడియోలు పోస్టు చేస్తే విమానాన్ని దారిమధ్యలోనే పేల్చేస్తారట అని ఓ ప్రయాణికుడు చెప్పడంతో కలకలం రేగింది.
తమిళుల 'ప్రీతి'ని కూడా పొందుతా

తమిళుల 'ప్రీతి'ని కూడా పొందుతా

'అర్జున్‌రెడ్డి'తో గుర్తింపు తెచ్చుకున్న నటి షాలిని పాండేకు తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. జీవీ ప్రకాశ్‌ సరసన '100% కాదల్‌', జీవాతో 'గొరిల్లా' చిత్రాల్లో నటిస్తోంది. షాలిని పాండే మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా ప్రేక్షకులు 'ప్రీతి' అనే పిలుస్తున్నారని చెప్పుకొచ్చింది. తెలుగులో లాగే తమిళంలో ప్రేక్షకులను మెప్పిస్తానని ధీమా వ్యక్తం చేసింది. మరికొన్ని చిత్రాల వివరాలను వెల్లడిస్తానని పేర్కొంది.