Short News

ఐదో వన్డేలో సౌతాఫ్రికా లక్ష్యం 275

ఐదో వన్డేలో సౌతాఫ్రికా లక్ష్యం 275

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (115) అదరగొట్టాడు. తొలుత టాస్ గెలిచిన ఆతిధ్యజట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఓపెనర్లు ఆచితూచి ఆడారు, ధావన్ పెవిలియన్ చేరినా కోహ్లీ సహకారంతో రోహిత్‌ సెంచరీ సాధించాడు. నిర్ణీత 50ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 274 పరుగులు చేసింది. ఈమ్యాచ్ గెలిస్తే టీమిండియా సిరీస్ సొంతం చేసుకుంటుంది.
బాఘీ -2 తర్వాత 'భాఘీ-3' ..అతడే హీరో

బాఘీ -2 తర్వాత 'భాఘీ-3' ..అతడే హీరో

బాలీవుడ్‌ చిత్రం 'భాఘీ' నుంచి మరో సీక్వెల్ రాబోతోంది. సిరీస్‌లో రెండో చిత్రం విడుదల కాకముందే మూడో దానిని ప్రకటించారు. మూడో భాగంలో కూడా టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా నటిస్తాడని నిర్మాత సాజిద్‌ నడియా వాలా ప్రకటించారు. మూడో భాగానికి అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తాడు. తెలుగు హిట్ సినిమా 'క్షణం' రీమేక్‌గా తెరకెక్కిస్తున్న బాఘీ-2లో దిశా పఠానీ నాయిక. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది.  
జనసేనానిపై.. మహేష్ కత్తి ప్రశంసలు, టీడీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేనానిపై.. మహేష్ కత్తి ప్రశంసలు, టీడీపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. అవిశ్వాస తీర్మానంపై పవన్ స్పందన బేష్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు పీకే సరైన లైన్‌లోకి వచ్చారని.. తన నుంచి కోరుకునేది ఇదేనని పేర్కొన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానం టీడీపీ పెడుతుందా? లేదా? అన్నది తాను చెప్పలేనని, ఎందుకంటే టీడీపీ తన పార్టనర్ కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, కటిక పేదరికం, మెడపట్టి గెంటేశారు: జబర్దస్త్ గెటప్ శ్రీను

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, కటిక పేదరికం, మెడపట్టి గెంటేశారు: జబర్దస్త్ గెటప్ శ్రీను

జబర్దస్త్ కార్యక్రమంలో వివిధ గెటప్స్ వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గెటప్ శ్రీను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్న తనంలో తాను పడ్డ కష్టాలతో పోలిస్తే ఇండస్ట్రీలో పడ్డ కష్టం పెద్ద కష్టమే కాదన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అవమానాల గురించి కూడా తెలిపారు. నేను బాగా హర్టయిపోయి సూసైడ్ వరకు వెళ్లింది తేజ కేక సినిమా సమయంలో అని తెలిపారు. చివరకు బ్రతికి సాధిద్దామని డిసైడైనట్లు తెలిపారు.