Short News

ఫుట్‌బాల్‌ ప్ర‌పంచ క‌ప్‌కు ప‌టిష్ఠ భ‌ద్ర‌త‌

ఫుట్‌బాల్‌ ప్ర‌పంచ క‌ప్‌కు ప‌టిష్ఠ భ‌ద్ర‌త‌

ఇళ్లల్లో, వీధుల్లో ఎక్కడ చూసినా ఫుట్‌బాల్‌ సందడే. స్టేడియాలు ముస్తాబయ్యాయి. ఫుట్‌బాల్‌ ప్ర‌పంచ క‌ప్‌కు రష్యా సిద్ధం అయింది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి అపశ్రుతులు లేకుండా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఘనంగా నిర్వహించి శెభాష్‌ అనిపించుకోవాలని తహతహలాడుతోంది రష్యా. గగనతల రక్షణ వ్యవస్థను మోహరించింది. ప్రపంచ కప్‌కు వస్తున్న అభిమానుల నేపథ్యాన్ని కూడా గట్టిగా తనిఖీ చేస్తోంది. దాడుల భయంతో ప్రమాదకర పదార్థాల శుద్ధి చేసే పరిశ్రమలను వాటి యజమానులు మూసివేశారు. వివిధ దేశాల అభిమానులు 12 ఆతిథ్య నగరాల్లో ఎక్కడో ఒక చోట పోలీసుల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలి.  
సార్‌.. మమ్మల్ని వదిలి వెళ్ళకండి

సార్‌.. మమ్మల్ని వదిలి వెళ్ళకండి

తమిళనాడులోని వలైగారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన భగవాన్(28)‌ అనే ఆంగ్ల ఉపాధ్యాయుడికి ఇటీవల బదిలీల్లో భాగంగా వేరే పాఠశాలకు బదిలీ అయింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆయనను వెళ్ళద్దంటూ బతిమాలుకున్నారు. మరికొందరైతే ఏకంగా గట్టిగా కౌగలించుకొని ఏడ్వసాగారు. భగవాన్‌ వారికి ఎంత నచ్చచెప్పినా వినకుండా అదే తరహాలో ఆయనను పాఠశాల నుంచి వెళ్ళనీయలేదు. త్వరలోనే మళ్లీ తిరిగి వస్తానంటూ చెప్పాక గానీ విద్యార్థులు వదల్లేదు. విద్యార్థులతో ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా, ఒక అన్నలా, స్నేహితుడిలా కలిసిపోవటంతో వారు వెళ్ళనీయట్లేదని భగవాన్ తెలిపాడు.
ఐపీవో సహా పలు నిబంధనల్లో మార్పులు

ఐపీవో సహా పలు నిబంధనల్లో మార్పులు

మార్కెట్‌ రెగ్యులేటరీ సంస్థ సెబీ ఐపీవోలతో సహా పలు నిబంధనలను మార్చింది. గురువారం సెబీ బోర్డు మీటింగ్‌ అనంతరం సెబీ ఛైర్మన్‌ అజేయ్‌ త్యాగి విలేకర్లతో మాట్లాడారు. ఐపీవోలో షేర్‌ ప్రైస్‌బ్యాండ్‌ నిర్ణయించే సమయాన్ని ఐదు నుంచి రెండు రోజులకు తగ్గించినట్లు పేర్కొన్నారు. బైబ్యాక్‌ ,ఎఫ్‌పీఐ, మ్యూచివల్‌ ఫండ్స్‌ నిబంధనలు కూడా మార్చినట్లు పేర్కొన్నారు. 'కొత్త నిబంధనల ప్రకారం బోర్డు తీర్మానానికి, వాటా దారులకు చెల్లింపులు చేసిన తేదీకి మధ్య కాలాన్ని బైబ్యాక్‌ పీరియడ్‌గా భావిస్తారు. టేకోవర్‌ నిబంధనల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. 
రూ.1,431 కోట్లు సమీకరించిన  'స్విగ్గీ'

రూ.1,431 కోట్లు సమీకరించిన 'స్విగ్గీ'

ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది.  విదేశీ పెట్టుబడిదారుల నుంచి 210 మిలియన్‌ డాలర్లు (రూ.1,431 కోట్లు) సమీకరించింది. డీఎస్‌టీ క్యాపిటల్‌ల నుంచి ఈ మొత్తాలను సమీకరించింది. తాజా పెట్టుబడులతో కొత్త మార్కెట్లలోకి అడుగుపెట్టడం సాధ్యమవుతుందని స్విగ్గీ పేర్కొంది. ఈ రంగంలో ప్రస్తుతం అత్యంత విలువైన కంపెనీ స్విగ్గీనే. మరోవైపు ఫుడ్‌ పాండాను క్యాబ్‌ దిగ్గజం ఓలా కొనుగోలు చేసింది. జొమాటో మాత్రం అలీబాబా నుంచి 150 మిలియన్‌ డాలర్లను సమీకరించింది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more