Short News

ఇండియా స్పిన్నర్లపై ఒక అంచనాకు వచ్చాం

ఇండియా స్పిన్నర్లపై ఒక అంచనాకు వచ్చాం

భారత్‌, దక్షిణాఫ్రికా  జట్లు నేడు ఐదో వన్డేలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతోందనిసఫారీ పేసర్‌ ఫెలుక్వాయో తెలిపాడు. తొలి మూడు మ్యాచుల్లో ఓటమిని పునరావృతం కాకుండా చేసిన సఫారీలు భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలో అంచనాకు వచ్చినట్లు చెప్పాడు. నాలుగో వన్డే విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తెలిపాడు. పోర్ట్ ఎలిజబెత్ లో వీలైనంత వరకు డాట్‌ బాల్స్‌ వేసేందుకే ప్రయత్నించాలన్నాడు.  
బాబుతో కమల్ హాసన్ భేటీ?: మోడీకి చెక్, ఢిల్లీలో 'దక్షిణ' చక్ర

బాబుతో కమల్ హాసన్ భేటీ?: మోడీకి చెక్, ఢిల్లీలో 'దక్షిణ' చక్ర

2019 ఎన్నికల నేపథ్యంలో దక్షిణాదిన అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీకి చెక్ చెప్పేందుకు కొన్ని పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే కావొచ్చునని అంటున్నారు.దక్షిణాది రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రంలో ఆయా ప్రాంతీయ పార్టీకి పట్టు ఉంది. ఏపీలో టీడీపీ, వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, కర్నాటకలో జేడీఎస్, తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకేలకు పట్టు ఉంది. అయితే సౌతిండియాపై కన్నేసిన నేపథ్యంలో సంయుక్తంగా చెక్ పెట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

'రేణూ దేశాయ్‌' జ్ఞాపకాల్లో పవన్ కళ్యాణ్.?
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/avG2pnV3sWg" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

'రేణూ దేశాయ్‌' జ్ఞాపకాల్లో పవన్ కళ్యాణ్.?

నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసారు. దానిలో ఏమన్నారంటే, 'నాలోని జ్ఞాపకాలన్నింటినీ వెలికితీసాను. ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు చెక్కిన కలం నా జ్ఞాపకాల్లో నిక్షిప్తమయ్యాయి. కానీ కమ్ముకున్న హిమం కరిగిపోయి మళ్ళీ ఆ జ్ఞాపకాలు కళ్ళెదుట నిలిచాయి. తిరిగి చూసుకుంటే తుప్పు పట్టిన కలం, పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్కలైన నా హృదయం, నేను రాసుకున్న లేఖల కాగితపు ముక్కలు కన్పించాయని పేర్కొంది. 
పీఎన్‌బీ స్కాం: నీరవ్ మోడీకి బ్యాంక్ ఆఫర్!

పీఎన్‌బీ స్కాం: నీరవ్ మోడీకి బ్యాంక్ ఆఫర్!

పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11వేల కోట్లకు పైగా ముంచి, దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోడీకి ఆ బ్యాంకు ఓ ఆఫర్ ఇచ్చింది. మోసపూరితంగా తీసుకున్న లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్వోయూ)ల ద్వారా తమ శాఖలకు జరిగిన నష్టాలను పూడ్చేందుకు సమగ్ర, అమలు చేయతగిన ప్లాన్‌తో తిరిగి రావాలని చెప్పింది. తాను అప్పులు చెల్లించే స్థితిలో లేనని, తన పరువు తీశారని నీరవ్ మోడీ బ్యాంకుకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. తాను తీసుకున్న మొత్తాని కంటే ఎక్కువ అప్పు చూపిస్తున్నారని ఆరోపించాడు.