Short News

'ఫించ్' మరో గోల్డెన్ డకౌట్

'ఫించ్' మరో గోల్డెన్ డకౌట్

టీ20 లీగ్-2018లో భాగంగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాడు అరోన్‌ ఫించ్‌ గోల్డెన్‌ డక్‌గా అవుటయ్యాడు. తొలి బంతికే వికెట్లు ముందు దొరికిపోయాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. మూడో వికెట్‌గా వచ్చిన ఫించ్ వెంటనే డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు.అంతకుముందు బెంగళూరు మ్యాచ్‌లో సైతం ఫించ్‌ గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. మరోవైపు ఫించ్ టీ20 లీగ్ లో ఇప్పటివరకూ ఏడు జట్లకు ప్రాతినిధ్యం వహించి అరుదైన ఘనత సాధించాడు.  
‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్  నటిస్తే బాగుంటుంది

‘డాక్టర్‌ స్ట్రేంజ్‌’ ‌లో సచిన్ నటిస్తే బాగుంటుంది

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తన బయోపిక్‌ ‘సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' చిత్రంతో నటుడిగా మారారు. అయితే ఈ సినిమాలో సచిన్‌ నటన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌కి కూడా తెగ నచ్చేసినట్టుంది. సచిన్‌ అమెరికన్‌ సూపర్‌హీరో సిరీస్ ‘డాక్టర్‌ స్ట్రేంజ్‌' ‌లో నటిస్తే బాగుంటుందని బెనెడిక్ట్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ సిరీస్‌లో బెనెడిక్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బెనెడిక్ట్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్' చిత్రం భారత్‌లో ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా మరో మారు వాయిదా పడి జూన్ 7 న విడుదలకు సిద్ధం అవుతోంది. రజనీకాంత్ నటించిన మరో చిత్రం 2.0 కూడా విడుదల కావలసి ఉంది. 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకమైన స్టంట్స్ కోసం 40 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారట.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు.

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

ఎయిరిండియా బోయింగ్ విమానం ప్రయాణికులను బెంబెల్లెత్తించింది. విమానంలోని విండో ప్యానెల్ విరిగి ప్రయాణికులపై పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.15 నిమిషాల పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండైన వెంటనే గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఓవర్ హెడ్ ప్యానెల్‌కు తల బలంగా తాకిన ప్రయాణికుడికి కుట్లు పడినట్టు చెప్పారు.