Short News

టికెట్లున్నా.. మ్యాచ్ చూసేందుకు అనుమతించలేదు

టికెట్లున్నా.. మ్యాచ్ చూసేందుకు అనుమతించలేదు

మొహాలీ వేదికగా ఆదివారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ - చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ చూడాలన్న అభిమానుల ఆశ ఆవిరైపోయింది. ఈమ్యాచ్‌ చూసేందుకు ఇద్దరి దగ్గర టిక్కెట్లు ఉన్నా వారిని భద్రతా సిబ్బంది లోపలికి పంపించలేదు. అప్పటికే స్టేడియం నిండిపోయిందని..లోపలికి వెళ్లడం కుదరదు అని చెప్పారట. గేట్ల దగ్గర ఉన్న సిబ్బందిని ఎంతో బతిమలాడారట. బలవంతంగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుంటారని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేది ఏమీ లేక అక్కడే కూర్చుండిపోయారట.
మరోసారి తండ్రి కాబోతున్న షాహిద్‌ కపూర్‌

మరోసారి తండ్రి కాబోతున్న షాహిద్‌ కపూర్‌

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త సందడి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షాహిద్‌ షేర్ చేసిన మిషా ఫొటోలో బిగ్‌ సిస్టర్‌ అనే అక్షరాలు ఉండటం దీనికి మరింత బలం చేకూర్చుతోంది. షాహిద్‌- మీరా దంపతులు మరో బేబీని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు. మీరా రాజ్‌పుత్‌ ప్రెగ్నెంట్‌ అంటూ బీ టౌన్‌లో ఇప్పటికే వదంతులు ప్రచారం అవుతున్నాయి. షాహిద్‌ కపూర్‌ 2015లో మీరా రాజ్‌పుత్‌ను పెళ్ళాడాడు. షాహిద్‌ ప్రస్తుతం శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో సభట్టీ గుల్‌ మీటర్‌ చాలూ' సినిమాలో నటిస్తున్నాడు. 
పవన్ కళ్యాణ్ కొత్త న్యూస్ ఛానల్! పేరేంటో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కొత్త న్యూస్ ఛానల్! పేరేంటో తెలుసా ?

పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగ్రేటం చేసిన తరువాత కొంతమంది అతన్ని ప్రశంసిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. శ్రీ రెడ్డి, వర్మ, కత్తిమహేష్ వంటివారు పవన్ ను ఎలా విమర్శిస్తున్నారో చూస్తున్నాం. వాటికి సమాధానంగా పవన్ తనదైనా శైలిలో విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తూ వస్తున్నారు. నిన్న ఆయన చాంబర్ లో చేసిన నిరసనకు మెగా హీరోలు అందరు మద్దతు తెలపడం విశేషం. తాజా సమాచారం మేరకు పవన్ కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

పవన్‌కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

పవన్‌కళ్యాణ్‌పై వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

జనసేన అధినేత, నటుడు పవన్‌కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని నటుడు షకలక శంకర్‌ అన్నాడు. శ్రీకాకుళంలోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గల గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా జిల్లా పవన్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శంకర్‌ మాట్లాడుతూ 'పవన్‌ కళ్యాణ్‌పై, ఆయన తల్లిపై కొందరి ప్రోద్బలంతో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. పవన్‌ డిమాండుపై ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధులు స్పందించి కఠిన నిర్ణయం తీసుకోవాలి 'అన్నాడు.