Short News

టాస్ గెలిచిన పంజాబ్.. ముంబై బ్యాటింగ్

టాస్ గెలిచిన పంజాబ్.. ముంబై బ్యాటింగ్

టీ20లీగ్ 2018లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తలపడనున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుని ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. సొంత గడ్డపై మ్యాచ్ ఆడి కచ్చితంగా గెలిచి తీరాలనే బలమైన సంకల్పంతో ముంబై ఇండియన్స్ మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ సీజన్ లో ఇరు జట్లు 12 మ్యాచ్‌ల వరకూ ఆడాయి. ముంబై ఆరో స్థానంలో కొనసాగుతుండగా, పంజాబ్ ఐదో స్థానంలో రాణిస్తోంది. ఈ మ్యాచ్ లో అసాధారణ విజయం సాధించి రాయల్స్ జట్టును వెనుకపడేస్తే తప్ప ముంబైకి ప్లేఆఫ్ రేసులో చోటు దక్కదు.
ఢిల్లీ స్క్రిప్టుతో పవన్! జగన్ లాలూచీ: కేంద్రంపై బాబు

ఢిల్లీ స్క్రిప్టుతో పవన్! జగన్ లాలూచీ: కేంద్రంపై బాబు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన ధర్మపోరాట సభలో ఆయన ప్రసంగించారు.'మనం న్యాయం కోసం పోరాడుతున్నాం. ఈ ధర్మపోరాటానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలందరికీ పాదాభివందనాలు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి విశాఖ ముఖద్వారం. దేనికి మనం పోరాటం చేస్తున్నామో అంతా ఆలోచించాలి. మన స్వార్థం కోసం కాదు. జాతి ప్రయోజనాల కోసం. భావితరాల భవిష్యత్తు కోసమే' అని అన్నారు.

'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

క్వాంటికో టెలివిజన్ సిరీస్ తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా కొంత విరామం తర్వాత బాలీవుడ్‌లో నటిస్తోంది. స‌ల్మాన్ స‌ర‌స‌న భార‌త్ అనే చిత్రం చేస్తున్న ఈ భామ సోనాలి బోస్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక చిత్రాన్ని అంగీకరించింది. 'ఇమ్యునోడెఫిషియన్సీ' వ్యాధితో మృతి చెందిన 18 ఏళ్ళ అయేషా చౌద‌రి జీవిత నేప‌థ్యంలో రూపొంద‌నున్న చిత్రంలో అయేషాగా జైరా వ‌సీమ్ న‌టించ‌నుండగా, ఆమె త‌ల్లి పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తుందని సమాచారం. ప్రియాంక భ‌ర్తగా అభిషేక్ బ‌చ్చ‌న్ నటించే అవకాశాలున్నాయి.  పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలో మంగళవారం తొలి ఏసీ బస్ షెల్టర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంగళవారం ఉదయం అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌ను ఆయన కేటీఆర్ ప్రారంభించారు. శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీ అరుదైన ఘనత సాధించింది.