Short News

చెలరేగిన కోల్‌కతా ..ఢిల్లీ లక్ష్యం 201

చెలరేగిన కోల్‌కతా ..ఢిల్లీ లక్ష్యం 201

టీ20 లీగ్-2018లో భాగంగా సొంత మైదానం ఈడెన్‌లో దిల్లీతో ఆడుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ చెలరేగి ఆడారు. ఆండ్రూ రసెల్‌ (41), నితీశ్‌ రాణా (55) బాదేసారు. దీంతో నిర్ణీత 20ఓవర్లు ముగిసే సరికి 200 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడో ఓవర్ మూడో బంతికి సునీల్ నరెన్(1) భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కీలక ఆటగాడు రాబిన్ ఉతప్ప(35) సదీమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు. కెప్టెన్ దినేష్ కార్తీక్(19)పరుగులు చేసాడు.
జాహ్నవి హ్యాపీ మూడ్.. సెలబ్రేషన్స్‌లో శ్రీదేవి కూతురు!

జాహ్నవి హ్యాపీ మూడ్.. సెలబ్రేషన్స్‌లో శ్రీదేవి కూతురు!

దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవిని ఓ వైపు విషాదాన్ని దిగమింగుతూ తన తొలి సినిమాను పూర్తి చేసింది. యువ హీరో ఇషాన్ కట్టర్‌తో ఆమె నటిస్తున్న దఢక్ చిత్ర షూటింగ్ పూర్తయింది. దాంతో జాహ్నవి, ఇషాన్ ఇద్దరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకొన్నారు. దఢక్ షూటింగ్ పూర్తయిన రోజే తన తొలి సినిమా బియాండ్ ది క్లౌడ్స్ రిలీజ్ కావడంతో ఇషాన్ ఆనందం రెండితలైంది. దఢక్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు శశాంక్ ఖైతాన్, జాహ్నవి తండ్రి, నిర్మాత బోనికపూర్ తదితరులు హాజరయ్యారు.

చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక ఉరి శిక్షే

చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక ఉరి శిక్షే

గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం తీవ్రమైన శిక్షలు అమలు చేసేందుకు సిద్ధమైంది. శనివారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం చిన్నారులపై అత్యాచారాల విషయమై కీలక నిర్ణయం తీసుకుంది. పోస్కో చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 12 ఏళ్లలోపు చిన్నారులపై అత్యాచారం జరిపివారికి మరణశిక్ష విధించేలా చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది.

అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే

అత్యాచారానికి పాల్పడితే ఇక మరణశిక్షే

12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారం చేస్తే ఇక మరణశిక్ష తప్పదు. నిందితులకు మరణదండన విధించేలా పోక్సో చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రమంత్రి వర్గం శనివారం ఆమోదించింది. పోక్సో చట్టానికి సవరణలు తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే. కతువా,ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది