Short News

నమాన్ ఓజా రికార్డును సమం చేసిన సునీల్ నరైన్

నమాన్ ఓజా రికార్డును సమం చేసిన సునీల్ నరైన్

కోల్‌కతా ఓపెనర్ సునీల్ నరైన్ అద్భుత రికార్డును సాధించాడు. టీ20లీగ్ 2018లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే 21 పరుగులు చేసి నమాన్ ఓజా రికార్డును సమం చేశాడు. రాజస్థాన్ బౌలర్ కృష్ణప్ప గౌతమ్ వేసిన తొలి ఓవర్‌లో సునీల్ వరుసగా 6,4,6,4,1,0 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్టోక్స్ వేసిన రెండో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి గౌతమ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో ఐపీఎల్‌లో తొలి ఓవర్‌లో 21 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా సునీల్ నిలిచాడు.
'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

క్వాంటికో టెలివిజన్ సిరీస్ తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా కొంత విరామం తర్వాత బాలీవుడ్‌లో నటిస్తోంది. స‌ల్మాన్ స‌ర‌స‌న భార‌త్ అనే చిత్రం చేస్తున్న ఈ భామ సోనాలి బోస్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక చిత్రాన్ని అంగీకరించింది. 'ఇమ్యునోడెఫిషియన్సీ' వ్యాధితో మృతి చెందిన 18 ఏళ్ళ అయేషా చౌద‌రి జీవిత నేప‌థ్యంలో రూపొంద‌నున్న చిత్రంలో అయేషాగా జైరా వ‌సీమ్ న‌టించ‌నుండగా, ఆమె త‌ల్లి పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తుందని సమాచారం. ప్రియాంక భ‌ర్తగా అభిషేక్ బ‌చ్చ‌న్ నటించే అవకాశాలున్నాయి.  పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలో మంగళవారం తొలి ఏసీ బస్ షెల్టర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంగళవారం ఉదయం అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌ను ఆయన కేటీఆర్ ప్రారంభించారు. శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీ అరుదైన ఘనత సాధించింది.

రాజకీయ నేపథ్య చిత్రంతో నమిత రీ-ఎంట్రీ.!

రాజకీయ నేపథ్య చిత్రంతో నమిత రీ-ఎంట్రీ.!

నటి నమిత 'ఎంగల్‌ అన్నా' చిత్రంతో తమిళతెరకు పరిచయమై కొన్నేళ్ళ పాటు అగ్ర నాయికగా కొనసాగారు. చెన్నైలో సెటిల్‌ అయిన అమ్మడికి  అవకాశాలు తగ్గటంతో గతేడాది నిర్మాతను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పిందని భావిస్తున్న తరుణంలో త్వరలో మరోసారి కథానాయికగా కనిపించనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకుడు టి.రాజేందర్‌ స్వీయ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో నమిత ప్రతినాయకిగా నటించనున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.