Short News

పొలార్డ్ అర్ధ సెంచరీ ..పంజాబ్ లక్ష్యం 187

పొలార్డ్ అర్ధ సెంచరీ ..పంజాబ్ లక్ష్యం 187

వాంఖడే స్టేడియం వేదికగా ముంబై, పంజాబ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటింగ్ ముగిసింది. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కి చేసింది. పంజాబ్‌ బౌలర్‌ ఆండ్రూ టై(4/16) ధాటికి వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు సాధించే అవకాశాలను ముంబయి చేజేతులా కోల్పోయింది. పొలార్డ్ (50) పరుగులు చేసి ఆడుకోవటంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్‌లో టై (4), అశ్విన్ (2), రాజ్‌పుత్, స్టొనిస్ తలో వికెట్ తీసారు.
అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

దేశంలోని అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)నిలిచింది. 32 ప్రాంతీయ పార్టీల్లో రూ 82.72 కోట్ల ఆదాయంతో సమాజ్‌వాదీ అత్యంత సంపన్న పార్టీగా నిలిచిందని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక వెల్లడించింది. ఎస్‌పీ తర్వాత రూ 72.92 కోట్లతో టీడీపీ రెండో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక ఏఐఏడీఎంకే రూ 48.88 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉంది. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2016-17లో రూ 321.03 కోట్లుగా నమోదైంది.
బీకాం చదివే కూతురిపై మూడేళ్లుగా లైంగిక దాడి చేసిన తండ్రి

బీకాం చదివే కూతురిపై మూడేళ్లుగా లైంగిక దాడి చేసిన తండ్రి

వయసొచ్చిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కామంతో ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. మూడేళ్లుగా భార్య సహకారంతో.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కన్న కూతురిపై మూడేళ్లుగా లైంగికదాడికి పాల్పడ్డాడు ఒక కిరాతకుడు. తాజాగా ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. మూడేళ్లుగా కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ కసాయి తండ్రి. అయితే ఇందుకు అతనికి సహకరించిన తల్లిని సైతం పోలీసులు కటకటాల్లోకి పంపారు.

100 కోట్లతో ధనుష్ భారీ బడ్జెట్ మూవీ.. షారుక్ డైరెక్టర్‌తో బాలీవుడ్ చిత్రం.. హాలీవుడ్ సినిమా రెడీ!

100 కోట్లతో ధనుష్ భారీ బడ్జెట్ మూవీ.. షారుక్ డైరెక్టర్‌తో బాలీవుడ్ చిత్రం.. హాలీవుడ్ సినిమా రెడీ!

తమిళ, ఆంగ్ల చిత్రాలపై దృష్టిపెడుతున్న హీరో ధనుష్ వరుస విజయాలు, సక్సెస్‌లతో దూసుకెళ్లున్నారు. గతంలో పవర్ పాండీ చిత్రానికి దర్శకత్వం వహించిన ధనుష్ మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చిత్రం ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లునున్నది. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ధనుష్ వెల్లడించారు.ఓ వైపు నిర్మాతగా కాలా చిత్రాన్ని తెరకెక్కిస్తూనే ధనుష్ తాను నటించే చిత్రాలతో బిజీగా మారారు. హాలీవుడ్‌లో ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ చిత్రంలో నటించారు.