Short News

నొప్పి వేధిస్తున్నా 'కూల్'గా ఆడేసాడు

నొప్పి వేధిస్తున్నా 'కూల్'గా ఆడేసాడు

టీ20 లీగ్ 2018లో భాగంగా ఆదివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సారధి ధోనీ దుమ్మురేపాడు. 36ఏళ్ళ వయసులో ఒక పక్క వెన్నునొప్పి వేధిస్తున్నా చివరి బాల్ వరకూ కూల్ గా పోరాడాడు. 44 బంతుల్లో 79 పరుగులు చేసినా చివరికి 4 పరుగులతో చెన్నై ఓటమి చెందింది. నొప్పి బాధపెడుతున్నా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఇన్నింగ్స్ కొనసాగించిన ధోనీను పలువురు క్రికెటర్లు పొగడ్తల్లో ముంచెత్తారు. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ 'గేల్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్, పంజాబ్ బౌలర్ ముజీబ్ బౌలింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాయని' అన్నాడు.
నాది కూడా కథువా ఘటనలాంటిందే:షమీ భార్య

నాది కూడా కథువా ఘటనలాంటిందే:షమీ భార్య

బుధవారం సాయంత్రం కథువా బాధిత చిన్నారి కోసం ఓ ఎన్జీవో నిర్వహించిన శాంతి ర్యాలీలో టీమిండియా పేసర్‌ మహ‍్మద్‌ షమీ భార్య హసిన్‌ జహాన్‌ పాల్గొంది. ఈ సందర్భంగా హసిన్‌ షాకింగ్‌ కామెంట్లు చేశారు. తన వ్యవహారాన్ని కథువా హత్యాచార ఘటనతో పోల్చుకుంది. ఒక రకంగా తాను కూడా కథువా తరహా బాధితురాలినే. కానీ, ఆ చిన్నారి చనిపోతే.. తానింకా బతికున్నానని.. కథువా ఘటనలో ఏవేం జరిగాయో.. తన క్కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయన్నారు.
అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర పోషించడం చాలా కష్టంగా ఉందన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్'లో ఆయన మన్మోహన్‌సింగ్ పాత్రను పోషిస్తున్నారు. తాను ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు మన్మోహన్‌సింగ్ చరిత్రను అధ్యయనం చేశానని తెలిపారు. ఎంతో కష్టమైన పాత్రను పోషిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పాత్ర పోషించడం తన సినీ కెరీర్ లో సవాల్ గా నిలిచిందన్నారు అనుపమ్‌ఖేర్.  
కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

గుంటూరు:వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిష్ట అడుగంటుతున్న నేపథ్యంలో తమ రాజకీయ మనుగడ దృష్ట్యా పలు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బైటపడేందుకు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరేందుకు సర్వ సన్నద్దం అయినట్లు సమాచారం.