Short News

ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు

ఉత్కంఠ పోరులో ముంబై గెలుపు

ప్లేఆఫ్స్‌ బెర్తు కోసం పోరాటం కొనసాగిస్తోన్న ముంబయి గెలుపు బాట పట్టింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. కీరన్‌ పొలార్డ్‌ (50), కృనాల్‌ పాండ్య (32) మెరుపులతో ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్‌ టై (4/16) గొప్ప బౌలింగ్‌ ప్రదర్శన చేసాడు. అనంతరం ఛేదనలో కేఎల్‌ రాహుల్‌ (94) పోరాడినా పంజాబ్‌ను గెలిపించలేకపోయాడు. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 183 పరుగులే చేయగలిగింది. ముంబయిని గెలిపించిన బుమ్రా 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు.
రూ.98కే రోజుకు 1.5 జీబీ డేటా అంటున్న బీఎస్ఎన్ఎల్‌

రూ.98కే రోజుకు 1.5 జీబీ డేటా అంటున్న బీఎస్ఎన్ఎల్‌

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. డేటా సునామీ ఆఫర్ కింద రూ.98కే ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు వాలిడిటీని 26 రోజులుగా నిర్ణయించారు. అంటే మొత్తం 26 రోజులకు గాను 39 జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. ఈ క్రమంలో 1 జీబీ డేటా ఖరీదు కేవలం రూ.2.51 మాత్రమే అవుతుంది. జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.98 ప్లాన్ లభిస్తుండడం విశేషం.   
రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

వయస్సు మీద పడుతున్నకొద్దీ స్త్రీలలో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందన్న సంగతి తెలిసిందే! ఎముకలు పూర్వ ఆరోగ్యం సంతరించుకోవడానికి ప్రతి రోజూ రెండు నిమిషాలు పరుగు తీయడం లేదా జిమ్‌లో బరువులెత్తడం చేస్తే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. సుమారు 2500 మంది స్త్రీల మీద వీరు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరి చేత ప్రతి రోజూ రెండు నిమిషాల పాటు పరుగు, జిమ్‌లో బరువులెత్తించడం చేశారు. మిగతావారిని మామూలుగా నడవమన్నారు. కొన్ని రోజుల తరువాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించగా పరుగుతీసిన స్త్రీలలో ఎముకల ఆరోగ్యం మునుపటికన్నా మెరుగు పడటం గుర్తించారు.     
ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

టీ20లీగ్ 2018లో భాగంగా పుణే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ గెలిచింది. సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. బ్యాట్స్ మెన్స్ పేలవ ప్రదర్శనతో సొంతగడ్డపై 163 పరుగులకే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు. అంతకుముందు ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు 174 పరుగులు చేసింది. రిషబ్ పంత్ ఆఫ్ సెంచరీ సాధించాడు.