Short News

రహానేకు కోహ్లీ 'మొక్క' ఎందుకు ఇచ్చాడంటే..

రహానేకు కోహ్లీ 'మొక్క' ఎందుకు ఇచ్చాడంటే..

టీ20 లీగ్ 2018లో భాగంగా ఆదివారం బెంగళూరు వేదికగా రాజస్థాన్‌, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆర్‌సీబీ ఆటగాళ్ళు ఆకుపచ్చరంగు జెర్సీ దుస్తులతో కనిపించారు. 'పర్యావరణాన్ని పరిరక్షిద్దాం..' అనే నినాదంతో ఆకుపచ్చ జెర్సీని ధరించి బరిలోకి దిగారు. 2011 నుంచి ప్రతి టోర్నీలోనూ ఏదో ఒక మ్యాచ్‌లో ‘గో గ్రీన్‌' అంటూ ఆకుపచ్చ రంగు జెర్సీ ధరించి మ్యాచ్‌ను ఆడటం ఆనవాయితీగా వస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆటగాళ్ళు గో గ్రీన్‌ అంటూ సందేశం పంపారు. టాస్‌ ముందు విరాట్‌ కోహ్లీ, రాజస్థాన్‌ కెప్టెన్‌ రహానెకు మొక్కను అందించాడు.
అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

అబ్బో..మన్మోహన్ లా నటించడం కష్టంగా ఉంది

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర పోషించడం చాలా కష్టంగా ఉందన్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్. ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్'లో ఆయన మన్మోహన్‌సింగ్ పాత్రను పోషిస్తున్నారు. తాను ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు మన్మోహన్‌సింగ్ చరిత్రను అధ్యయనం చేశానని తెలిపారు. ఎంతో కష్టమైన పాత్రను పోషిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ పాత్ర పోషించడం తన సినీ కెరీర్ లో సవాల్ గా నిలిచిందన్నారు అనుపమ్‌ఖేర్.  
కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

కన్నా అస్వస్థతకు కారణం అదేనా?...అయినా వైసిపిలో చేరతారా?

గుంటూరు:వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారే విషయం అనూహ్య పరిణామాల నేపథ్యంలో నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రతిష్ట అడుగంటుతున్న నేపథ్యంలో తమ రాజకీయ మనుగడ దృష్ట్యా పలు కీలక నేతలు ఆ పార్టీ నుంచి బైటపడేందుకు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిలో చేరేందుకు సర్వ సన్నద్దం అయినట్లు సమాచారం.

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌

నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌లో 2018-19 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆరేళ్ల బీటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో చేరేందుకు పదో తరగతి చదివిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 28 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. విద్యార్హతలు, ధ్రువీకరణ పత్రాలను జూన్‌4లోపు పంపించాలి. ఎంపికైన విద్యార్థుల జాబితా జూన్‌ 11న ప్రకటించి, 18, 19 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.