Short News

బెంగళూరు బాదుడు ..హైదరాబాద్ లక్ష్యం 219

బెంగళూరు బాదుడు ..హైదరాబాద్ లక్ష్యం 219

చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరు, హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బెంగళూరు బ్యాటింగ్‌ చేసింది. డివిలియర్స్ (69), అలీ(65) లు అర్థ శతకాలు నమోదు చేసారు. ఇద్దరూ ఔటయ్యాక గ్రాండ్‌హోం(40) స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ (3), సిద్ధార్త్ కౌల్ (2), సందీప్ శర్మ (1)  వికెట్ తీసారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

టీ20లీగ్ 2018లో భాగంగా పుణే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 13 మ్యాచ్ లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 8 మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్స్ పట్టికలో 2 వ స్థానంలో ఉంది. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 13 మ్యాచ్ లు ఆడగా.. కేవలం మూడింటిలో గెలిచి పాయింట్స్ పట్టికలో కింద వరుస నుంచి రెండో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ గెలిస్తే చెన్నై టాప్ ప్లేస్ కు చేరుకోనుంది.
వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

నటుడు రామ్‌చరణ్‌.. తారక్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. చరణ్, ఎన్టీఆర్ ను వెనక నుంచి పట్టుకుని సరదాగా ఆటపట్టిస్తున్నట్లు ఉన్న ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా! ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి' అని చరణ్‌ పోస్ట్ చేశారు.‌ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి  సిక్కు మహిళ

న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి సిక్కు మహిళ

గురుశోచ్‌ కౌర్‌ అనే సిక్కు మహిళ తొలిసారిగా అరుదైన ఘనత సాధించారు. తలపాగా ధరించిన ఓ సిక్కు మహిళ మొదటిసారిగా న్యూయార్క్‌ పోలీస్‌ విభాగంలో చేరనున్నారు. న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ అకాడమీలో గతవారం డిగ్రీ పూర్తి చేసుకున్న ఆమె పోలీసు సహాయక అధికారిణిగా న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరనున్నారు. యూఎస్‌ ప్రజలు సిక్కిజాన్ని అర్థం చేసుకునే విధంగా గురుశోచ్‌ కౌర్‌ మార్పుతేవాలని ‘మినిష్టర్‌ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌' హరదీప్‌ సింగ్‌ పూరి కోరారు.