Short News

వాళ్లిద్దరిపై ఆధార‌ప‌డొద్దని హైద‌రాబాద్‌కు సూచ‌న‌

వాళ్లిద్దరిపై ఆధార‌ప‌డొద్దని హైద‌రాబాద్‌కు సూచ‌న‌

ప్రతిసారీ విలియమ్సన్, శిఖర్‌ ధావన్‌లపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదని మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ హైద‌రాబాద్‌కు సూచించారు. టీ 20 లీగ్ లో పిచ్‌లు అద్భుతంగా ఉన్నాయని ఈ విషయంలో బీసీసీఐని మెచ్చుకోవాలని తెలిపారు. భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా పిచ్‌లపై బౌన్స్‌ ఇంకా ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందేన‌న్నారు. మరోవైపు ప్లే ఆఫ్‌కు ముందు హైదరాబాద్‌ జట్టు మళ్లీ విజయాల బాట పట్టాలనే లక్ష్యంతో ఉంది. అయితే నెమ్మదిగా జోరు పెంచి ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టు పోటీలో ఉందన్న సంగతి మర్చిపోవద్దని స‌న్నీ సూచించారు. 
మాధురి దీక్షిత్ డ్యాన్స్‌.. ఆన్‌లైన్లో వైర‌ల్‌

మాధురి దీక్షిత్ డ్యాన్స్‌.. ఆన్‌లైన్లో వైర‌ల్‌

బాలీవుడ్ అందాల నటి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేసిందంటే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఐదు పదుల వయసులోనూ తన డ్యాన్స్ ఫర్‌ఫార్మెన్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది మాధురీ. రేణుక సహానే, మాధురీ 1994లో వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్' చిత్రంలోని సీన్ ను మరోసారి రిపీట్ చేశారు ఈ ఇద్దరు తారలు. మాధురీ తాజాగా బకెట్ లిస్ట్ అనే మరాఠీ డెబ్యూట్ మూవీ చేస్తుంది. ఈ సినిమా సెట్స్‌లో మాధురీ తన కోస్టార్ రేణుక సహానేతో కలిసి డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. ఈ డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.   
రూ.98కే రోజుకు 1.5 జీబీ డేటా అంటున్న బీఎస్ఎన్ఎల్‌

రూ.98కే రోజుకు 1.5 జీబీ డేటా అంటున్న బీఎస్ఎన్ఎల్‌

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. డేటా సునామీ ఆఫర్ కింద రూ.98కే ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు వాలిడిటీని 26 రోజులుగా నిర్ణయించారు. అంటే మొత్తం 26 రోజులకు గాను 39 జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. ఈ క్రమంలో 1 జీబీ డేటా ఖరీదు కేవలం రూ.2.51 మాత్రమే అవుతుంది. జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.98 ప్లాన్ లభిస్తుండడం విశేషం.   
రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

వయస్సు మీద పడుతున్నకొద్దీ స్త్రీలలో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందన్న సంగతి తెలిసిందే! ఎముకలు పూర్వ ఆరోగ్యం సంతరించుకోవడానికి ప్రతి రోజూ రెండు నిమిషాలు పరుగు తీయడం లేదా జిమ్‌లో బరువులెత్తడం చేస్తే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. సుమారు 2500 మంది స్త్రీల మీద వీరు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరి చేత ప్రతి రోజూ రెండు నిమిషాల పాటు పరుగు, జిమ్‌లో బరువులెత్తించడం చేశారు. మిగతావారిని మామూలుగా నడవమన్నారు. కొన్ని రోజుల తరువాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించగా పరుగుతీసిన స్త్రీలలో ఎముకల ఆరోగ్యం మునుపటికన్నా మెరుగు పడటం గుర్తించారు.