Short News

టీ20 మ్యాచ్‌.. మ‌హిళ‌ల జ‌ట్ల వివ‌రాలు వెల్ల‌డి

టీ20 మ్యాచ్‌.. మ‌హిళ‌ల జ‌ట్ల వివ‌రాలు వెల్ల‌డి

మహిళా క్రికెటర్ల కోసం ఈ నెల 22న నిర్వహించబోతున్న టీ 20 మ్యాచులో పాల్గొనే బీసీసీఐ జట్ల పేర్లను, సభ్యుల వివ‌రాల‌ను టీ20 లీగ్ ఛైర్మ‌న్ రాజీవ్ శుక్లా వెల్ల‌డించారు.  ఐపీఎల్‌ ట్రయల్‌ బ్రేజర్స్‌: స్మృతి (కెప్టెన్‌), అలిసా(వికెట్‌ కీపర్‌), బేట్స్‌, దీప్తి, బెత్‌ మూనీ, రోడ్రిక్స్‌, హాజెల్‌, శిఖా, టహుహు, జులన్‌, ఏక్తా బిస్ఠ్‌, పూనమ్‌ యాదవ్‌, హేమలత. ఐపీఎల్‌ సూపర్ ‌నోవాస్‌: హర్మన్‌(కెప్టెన్‌), మిథాలీ రాజ్‌, మెక్‌లానింగ్‌, సోఫీ డివైన్‌, ఎలిసన్‌, వేద కృష్ణమూర్తి, మోన మెశ్రమ్‌, పూజా, మేగన్‌ స్కౌట్‌, రాజేశ్వరి, అనూజ, తానియా భాటియా(వికెట్‌ కీపర్‌).       
అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

అత్యంత ధనిక పార్టీల్లో ఫస్ట్ సమాజ్ వాదీ, సెకండ్ టీడీపీ

దేశంలోని అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ)నిలిచింది. 32 ప్రాంతీయ పార్టీల్లో రూ 82.72 కోట్ల ఆదాయంతో సమాజ్‌వాదీ అత్యంత సంపన్న పార్టీగా నిలిచిందని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ నివేదిక వెల్లడించింది. ఎస్‌పీ తర్వాత రూ 72.92 కోట్లతో టీడీపీ రెండో అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఇక ఏఐఏడీఎంకే రూ 48.88 కోట్లతో తర్వాతి స్ధానంలో ఉంది. మొత్తం 32 ప్రాంతీయ పార్టీల ఆదాయం 2016-17లో రూ 321.03 కోట్లుగా నమోదైంది.
100 కోట్లతో ధనుష్ భారీ బడ్జెట్ మూవీ.. షారుక్ డైరెక్టర్‌తో బాలీవుడ్ చిత్రం.. హాలీవుడ్ సినిమా రెడీ!

100 కోట్లతో ధనుష్ భారీ బడ్జెట్ మూవీ.. షారుక్ డైరెక్టర్‌తో బాలీవుడ్ చిత్రం.. హాలీవుడ్ సినిమా రెడీ!

తమిళ, ఆంగ్ల చిత్రాలపై దృష్టిపెడుతున్న హీరో ధనుష్ వరుస విజయాలు, సక్సెస్‌లతో దూసుకెళ్లున్నారు. గతంలో పవర్ పాండీ చిత్రానికి దర్శకత్వం వహించిన ధనుష్ మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ చిత్రం ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లునున్నది. అలాగే బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ధనుష్ వెల్లడించారు.ఓ వైపు నిర్మాతగా కాలా చిత్రాన్ని తెరకెక్కిస్తూనే ధనుష్ తాను నటించే చిత్రాలతో బిజీగా మారారు. హాలీవుడ్‌లో ది ఎక్ట్స్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ చిత్రంలో నటించారు.

ప్రియాంక శిబిర స్పంద‌న‌పై విమ‌ర్శ‌లు

ప్రియాంక శిబిర స్పంద‌న‌పై విమ‌ర్శ‌లు

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవ‌ల బంగ్లాదేశ్ లోని రోహింగ్యా శరణార్థుల శిబిరాలను సందర్శించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై నెటిజెన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ముందు దేశంలోని పరిస్థితుల గురించి ఆలోచిస్తే మంచిదని సలహా కూడా ఇస్తున్నారు. ప్రియాంక త‌న శిబిర సంద‌ర్శ‌న ఫొటోను ట్వీట్ చేశారు. దీనిపై కొంత మంది నెటిజెన్లు హర్షం వ్యక్తం చేయగా, మరికొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకు, మీ యూనిసెఫ్‌కు మానవత్వం కేవలం రోహింగ్యా శరణార్ధులకే రిజర్వ్ చేశారా?'' అని ఒక వ్యక్తి ప్రశ్నించారు.