Short News

స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి, రూ.11 వేల వరకు తగ్గిన ఫోన్ల వివరాలు

స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి, రూ.11 వేల వరకు తగ్గిన ఫోన్ల వివరాలు

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే మీకు సరైన అవకాశం..ఎందుకంటే దిగ్గజ కంపెనీల స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా తగ్గాయి. హైఎండ్ స్మార్ట్‌ఫోన్ల నుంచి లో ఎండ్ స్మార్ట్ ఫోన్ల దాకా వివరాలు భారీగా తగ్గాయి. యూజర్లను ఆకట్టుకునే క్రమంలో ఈ ఫోన్లపై తగ్గింపు ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. శాంసంగ్, హెచ్టీసీ, వివో, మోటరోలా, నోకియా, ఆసుస్ వంటి ఎన్నో కంపెనీలు తమ ఫోన్ల ధరలను రూ. 11 వేల వరకూ తగ్గిస్తున్నట్టు ఇటీవల ప్రకటించాయి.

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

దేశీయ టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో పెను సంచలనం సృష్టించింది. 2018-19లో 80 వేల మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఛీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జియోలో సుమారు 1.57 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, కొత్తగా మరో 75 వేల నుంచి 80 వేల మందిని చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
అమ్మ అంటే ఏంటో 'కణం'తో తెలుసుకున్నాను

అమ్మ అంటే ఏంటో 'కణం'తో తెలుసుకున్నాను

నటి సాయిపల్లవి 'కణం' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. నాగశౌర్య, సాయిపల్లవి నటించిన ఈ చిత్రానికి ఎ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్‌ అవుతున్న సందర్భంగా సాయిపల్లవి మీడియాతో మాట్లాడింది. 'ఈ సినిమాలో అమ్మ పాత్ర పోషించాను. అమ్మ పాత్రలో షేడ్స్‌ అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఈ సినిమా ద్వారా చాలా పరిణితి చెందానని అనుకుంటున్నాను. సినిమాలో నా పాత్ర నిడివి కంటే ఎంత ఇంపార్టెన్స్‌ అన్నది ముఖ్యంగా ఆలోచిస్తాను. సినిమా నుంచి నేను కోరుకునేది కేవలం ఆనందమే' అని చెప్పింది. 
క్యూ4లో 'యాక్సిస్' బ్యాంకు నష్టం రూ.2,189కోట్లు

క్యూ4లో 'యాక్సిస్' బ్యాంకు నష్టం రూ.2,189కోట్లు

దేశంలో మూడో అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్‌ 'యాక్సిస్‌'కు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. మొండిబకాయిలు భారంగా మారటంతో బ్యాంక్‌ రూ.2,189 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.14,181 కోట్ల నుంచి రూ.14,560 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం ఎలాంటి పెరుగుదల లేకుండా రూ.4,730 కోట్లుగా నమోదైంది. మొత్తం రుణాలు 18 శాతం వృద్ధి చెందాయి. గురువారం మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసాక ఫలితాలను ప్రకటించారు. దీనితో షేరు రూ.495 వద్ద ముగిసింది.