Short News

ఎయిర్‌టెల్ రూ.249, రూ.349 ప్రిపెయిడ్ ప్లాన్ విశేషాలివిగో...

ఎయిర్‌టెల్ రూ.249, రూ.349 ప్రిపెయిడ్ ప్లాన్ విశేషాలివిగో...

దేశంలోనే అతి పెద్ద మొబైల్ నెట్ వర్క్ గా పేరున్న ఎయిర్ టెల్ తన కొత్త ప్లాన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో మార్కెట్ లో రంగ ప్రవేశం చేసిన అనంతరం, మరోసారి టెలికాం రంగంలో టారిఫ్ ల యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ తన కొత్త టారిఫ్ ప్లాన్స్ తో కస్టమర్లను కట్టి పడేస్తోంది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు ఆన్ లిమిటెడ్ వాయిస్‌కాల్స్‌ను ఫెయిర్ యూసెజ్ పాలసీతో సంబంధం లేకుండా అందిస్తోంది.

ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?

ఇండియా ఫస్ట్ పీఎం నెహ్రూ కాదట, గూగుల్ సంచలనం, కారణమేంటి ?

గూగుల్ ఇండియా సెర్చ్ బార్ జవహర్ లాల్ నెహ్రూను నరేంద్ర మోడీగా మార్చివేసింది. ఇండియా తొలి ప్రధాని అని సెర్చ్ చేస్తే, జవహర్ లాల్ నెహ్రూ బదులుగా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కనిపిస్తుండటంతో నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఇక సెర్చ్ చేస్తే తొలుతగా వికీపీడియా లింక్‌ను చూపిస్తున్న గూగుల్ సెర్చ్ బార్, పక్కనే నరేంద్ర మోమై ఫోటోను చూపిస్తోంది. ఆయన పేరును నెహ్రూగా చూపిస్తోంది. ఇక ఈ తప్పిదంపై కాంగ్రెస్ సోషల్ మీడియా తీవ్రంగా విరుచుకుపడుతోంది. గూగుల్ ఇలాంటివి చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.

త్వరలో గూగుల్ ఫోన్లలో ‘యూట్యూబ్ రీమిక్స్’

త్వరలో గూగుల్ ఫోన్లలో ‘యూట్యూబ్ రీమిక్స్’

గూగుల్ ఆండ్రాయిడ్‌ ఫోన్ల వినియోగించే వారి కోసం గూగుల్ కొత్త అప్లికేషన్ తీసుకొస్తుంది. ఫోన్లలో ఉన్న డీఫాల్ట్‌ మ్యూజిక్‌ ప్లేయర్‌ స్థానంలో ‘యూట్యూబ్‌ రీమిక్స్‌'ను సంస్థ అందించబోతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత యూట్యూబ్‌ రీమిక్స్‌ను ఎంచుకేనేందుకు ఆప్షన్‌ను అందిస్తారని.. ఈ ఏడాది ఆఖరుకు గూగుల్‌ ప్లే మ్యూజిక్‌ను పూర్తిగా ఎత్తివేస్తారని సమాచారం.ఇందులో ప్లే లిస్ట్‌ రికమండేషన్స్‌తో పాటు ఆయా ప్రాంతాలను బట్టి పాటల రికమండేషన్స్‌ ఉంటాయట.
13 గంటల్లో 36వేలకు పైగా పిడుగులు, దడపుట్టించాయి

13 గంటల్లో 36వేలకు పైగా పిడుగులు, దడపుట్టించాయి

మంగళవారం రాత్రి గుంటూరు, కృష్ణా జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పదమూడున్నర గంటల పాటు పిడుగులు దడ పుట్టించాయి. ఏకంగా 36,479 పిడుగులు పడ్డాయి. ఏడుగురు మృతి చెందారు. ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి 15 రోజుల వ్యవధిలో మొత్తం 10,.436 పిడుగులు పడ్డాయి. కానీ మంగళవారం ఒక్కరోజే 36వేలకు పైగా పిడుగులు పడ్డాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏపీవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల పిడుగులు పడినట్లు విపత్తు నిర్వహణ సంస్థ గుర్తించింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా 35 వేలకు పైగా పిడుగులు పడగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 9057 పిడుగులు అత్యల్పంగా పడ్డాయి.