Short News

ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ బెస్ట్ అనే దానికి కారణాలు !

ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ బెస్ట్ అనే దానికి కారణాలు !

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జియో రోజు రోజుకు కొత్త కొత్త ఆఫర్లను అందిస్తూ ముందుకు దూసుకుపోతున్న తరుణంలో దానికి అనుగుణంగా ఇతర టెల్కోలు కూడా తమ మెదడుకు పనిచెప్పాయి. దిగ్గజాలన్నీ జియోకి పోటీగా సరికొత్త ఆఫర్లతో రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగానే airtel తమ వినియోగదారుల కోసం కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. వీటిల్లో ముఖ్యంగా పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన రూ. 499 ప్లాన్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

27 నుంచి యాదాద్రి నృసింహుని జ‌యంతి ఉత్స‌వాలు

27 నుంచి యాదాద్రి నృసింహుని జ‌యంతి ఉత్స‌వాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలను ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 27న శ్రీ వెంకటపతి అలంకార సేవ, లక్ష కుంకుమార్చన, 28న కాళీయమర్థన అలంకార సేవ, లక్షపుష్పార్చన చేయనున్నారు. 29న సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయి. ఉత్సవాల నేపథ్యంలో యాదాద్రిలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.   
హెచ్1బీ వీసా కలిగిన వారి భాగస్వాములకు త్వరలో షాక్!

హెచ్1బీ వీసా కలిగిన వారి భాగస్వాములకు త్వరలో షాక్!

అమెరికాలో హెచ్1బీ వీసాలతో ఉద్యోగాలు చేస్తున్న వారి జీవిత భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉంది. త్వరలో దీనికి ముగింపు పలకాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. హెచ్1బీ వీసాదారుల భాగస్వాముల హెచ్4 వీసాతో ఉద్యోగం చేస్తుంటారు. దీనిని తీసుకు వస్తే దాదాపు 70,000 మంది హెచ్4 వీసాదారులపై ప్రభావం పడనుంది. చట్టబద్దంగా దీనిని నిషేధించే యోచనలో అమెరికా ప్రభుత్వ ఉందని తెలుస్తోంది.చట్టబద్ధంగా దీనిని నిషేధించే యోచనలో ఉన్నట్లుగా ఫెడరల్ ఏజెన్సీ ఉన్నతాధికారి చట్ట సభ సభ్యులకు తెలిపారు.

మెగా హీరో చెయ్యబోతున్న మలయాళ సినిమా, గ్యాప్ తరువాత మళ్ళి సినిమా!

మెగా హీరో చెయ్యబోతున్న మలయాళ సినిమా, గ్యాప్ తరువాత మళ్ళి సినిమా!

హీరో అల్లు శిరీష్ చివరగా చేసిన చిత్రం 'ఒక్క క్షణం' పరువాలేదు అనిపించుకున్న ఈ సినిమా తర్వాతఈ హీరో చెయ్యబోయే సినిమాకు సంభందించి రకరకాల వార్తలు బయటికి రావడం జరిగింది. చివరికి మలయాళ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు ఈ మెగా హీరో.మలయాళంలో దుల్గర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'ఏబీసీడీ (అమెరికన్ బార్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ)' సినిమాను తెలుగులో అల్లు శిరీష్ రీమేక్ చెయ్యబోతున్నాడు. ఈ సినిమాను మధురా శ్రీధర్‌ నిర్మాణంలో సంజీవ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించనున్నారు.