Short News

వ్యాలంటైన్ ఆఫర్ ..రూ.15వేలకే ఐఫోన్‌

వ్యాలంటైన్ ఆఫర్ ..రూ.15వేలకే ఐఫోన్‌

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆపిల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌ మోడల్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల ద్వారా ఆపిల్‌ డివైజ్‌ను కొనుగోలు చేసే వారికి 10వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. ఈ ఆఫర్‌ కేవలం ఈఎంఐ లావాదేవీలకు మాత్రమే. ఐఫోన్ ఎస్‌ఈ, ఐఫోన్ ‌6 పై 7 వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఐఫోన్ ఎస్‌ఈ రూ.22వేలు కాగా 7 వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌తో రూ.15వేలకే ఐఫోన్ ఎస్‌ఈ లభిస్తోంది.
సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ పిటిష‌న్ తిర‌స్క‌రించిన ధ‌ర్మాసనం

సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ పిటిష‌న్ తిర‌స్క‌రించిన ధ‌ర్మాసనం

మహిళా న్యాయవాది ఇందు మల్హోత్రాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు తిరస్కరించింది. ఇందు నియామకంపై నిలుపుదల ఉత్తర్వులను జారీ చేసేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నిరాకరించారు. జస్టిస్ కే ఎం జోసఫ్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించేందుకు చేసిన సిఫారసును పునఃపరిశీలించాలని ప్రభుత్వం కోరడంలో తప్పు లేదన్నారు.     
ధోని.. నా నిద్ర డిస్టర్బ్‌ చేసాడు ..విజిల్ పోడు

ధోని.. నా నిద్ర డిస్టర్బ్‌ చేసాడు ..విజిల్ పోడు

చెన్నై, బెంగుళూరు మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ధోని, రాయుడు సిక్సర్లతో చెలరేగి ఆడటంతో చెన్నై జట్టు 5వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై జట్టుపై అభిమానులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'మిస్టర్‌ కూల్‌' ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ ట్విట్టర్‌లో కామెంట్లు చేసాడు. 'ఓరి దేవుడా, కాసేపు పడుకుందామనుకుంటే సిక్సర్ల వర్షంతో నా నిద్రకు భంగం కలిగించి చైన్నైకి విజయాన్ని అందించారు. ధోని విశ్వ విఖ్యాత ఆటగాడు. మీ ఆటకు విజిల్‌ వేయాల్సిందే (విజిల్‌ పోడు)' అంటూ కొనియాడాడు.
ఓవర్సీస్ బాక్సాఫీస్ ప్రిన్స్ మహేష్‌ పంజా.. అమెరికాలో ‘భరత్’ సరికొత్త రికార్డు!

ఓవర్సీస్ బాక్సాఫీస్ ప్రిన్స్ మహేష్‌ పంజా.. అమెరికాలో ‘భరత్’ సరికొత్త రికార్డు!

ప్రిన్స్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను చిత్రం కలెక్షన్ల పంట పండిస్తున్నది. ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ రూ.150 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో నాన్ బాహుబలి చిత్రాల రికార్డులను తిరగరాస్తున్నది. అమెరికాలో భరత్ అనే నేను సరికొత్త రికార్డును నెలకొల్పింది.అమెరికాలో ప్రిన్స్ మహేష్ చిత్రం కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. గత వారం రోజులో భరత్ అనే నేను రూ.17 కోట్లు ( 2.6 మిలియన్లు) వసూలు చేసింది.