Short News

హ్యుందాయ్‌ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్‌.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్‌ క్యాంప్‌

హ్యుందాయ్‌ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్‌.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్‌ క్యాంప్‌

దేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్స్‌.. తమ కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది. వేసవి కాలం ప్రవేశించడంతో హ్యుందాయ్‌(Hyundai India) కస్టమర్ల కోసం ప్రత్యేకంగా వేసవి శిబిరాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ శిబిరం ద్వారా కస్టమర్లు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు. పూర్తి సమాచారం ఈ కథనంలో..
బుల్లితెర నటి కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?

బుల్లితెర నటి కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?

సాధారణ ప్రజలతో పోలిస్తే.. సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారన్న విషయం అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ కన్నడ బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ ప్లస్ కారును కొనుగోలు చేశారు.నటి 'ప్రజ్ఞా భట్'(Prajna Bhat) కొనుగోలు చేసిన 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ ప్లస్' కారుకు సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఆమె, ఆమె భర్త నాగశ్రీత్ భట్ ఇద్దరూ కలిసి కారును డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. నెట్టింట్లో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త కారు కొన్న నటికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే వేలసంఖ్యలో ఈ ఫోటోలు లైక్స్ పొందాయి.
జనరల్‌ టికెట్‌ ప్యాసింజర్స్‌తో ఫుల్‌ రష్‌గా రిజర్వ్‌డ్‌ కోచ్‌లు

జనరల్‌ టికెట్‌ ప్యాసింజర్స్‌తో ఫుల్‌ రష్‌గా రిజర్వ్‌డ్‌ కోచ్‌లు

దేశంలోని రైళ్లలో జనరల్‌ టికెట్‌ ప్రయాణికులు.. ఇటీవల రిజర్వ్‌డ్‌ కోచ్‌(Train Reserved Coaches)ల్లో ప్రయాణిస్తున్న సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. ఈ కారణంగా టికెట్‌ రిజర్వ్‌ చేసుకున్న ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. జనరల్‌ బోగీల్లో రద్దీని తలపించేలా ఏసీ, స్లీపర్‌ కోచ్‌లు ఉంటున్నాయి. ఈ క్రమంలో దీనిపై ఓ ప్రయాణికుడు రైల్వేకు ఫిర్యాదు చేశారు.
ఫ్రీ బస్సులో బామ్మ, మనవరాలికి షాక్‌ ఇచ్చిన బస్‌ కండక్టర్‌.. లవ్‌బర్డ్స్‌కి టికెట్‌ వేసి ఝలక్‌

ఫ్రీ బస్సులో బామ్మ, మనవరాలికి షాక్‌ ఇచ్చిన బస్‌ కండక్టర్‌.. లవ్‌బర్డ్స్‌కి టికెట్‌ వేసి ఝలక్‌

ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ టిక్కెట్లు ఇచ్చినా(Free Ticket For Women).. వారు తీసుకెళ్తున్న లగేజీకి మాత్రం ఏకంగా రూ. 444 టికెట్ ఛార్జీలు వసూలు చేశారు కండక్టర్. ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇంతకీ వారు తీసుకెళ్తున్న లగేజీ ఏంటీ.?? ఆ లగేజీకి అంత ఛార్జీ వసూలు చేయడమేంటి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో..