Short News

ఇండియాలో బెస్ట్ ఫీచర్లతో లభిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే !

ఇండియాలో బెస్ట్ ఫీచర్లతో లభిస్తున్న 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే !

ఇండియాలో రోజు రొజురు మొబైల్ మార్కెట్ శర వేగంగా పుంజుకుంటోంది. దిగ్గజ కంపెనీలు అన్నీ సరికొత్త ఫీచర్లతో తమ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నాయి. ముఖ్యంగా ర్యామ్ వీలయినంత ఎక్కువగా ఉండే ఫోన్ల పైనే కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో 6జిబి ర్యామ్ ఫోన్ అన్నది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇండియా మార్కెట్లో అందుబాటులో ధరలో ఇప్పుడు లభిస్తున్న 6జిబి ర్యామ్ ఫోన్ల లిస్ట్ మీకందిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు ఈ ఫోన్ ఫీచర్లు ధర లాంటి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయవచ్చు.

క్యూ4లో ఎస్బీఐకి రూ. 7,718కోట్ల నష్టం

క్యూ4లో ఎస్బీఐకి రూ. 7,718కోట్ల నష్టం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు మొండి బకాయిలు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నిరర్థక ఆస్తులు పేరుకుపోతుండటంతో జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకు అంచనాలకు మించి భారీ నష్టాలను నమోదు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ.7,718కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం మాత్రం రూ.68,436.06కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.57,720.07కోట్లుగా ఉంది. ఇక ఈ త్రైమాసికంలో బ్యాంకు ప్రొవిజన్లు రూ.28,096కోట్లకు పెరిగాయి.

వెంకటేశ్వరస్వామితో పెట్టుకోవద్దు: చంద్రబాబు

వెంకటేశ్వరస్వామితో పెట్టుకోవద్దు: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీపై బీజేపీ కుట్రలు పన్నుతోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేశంలోనే సాంప్రదాయాలు, పరిశుభ్రత పాటించే దేవాలయాల్లో తిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయం అగ్రభాగాన ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ నగరంలో నిర్వహించిన ధర్మ పోరాట సభలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వివాదంపై చంద్రబాబు స్పందించారు. 'ఆ రోజు ఎన్టీఆర్ చూపిన క్రమశిక్షణే వెంకటేశ్వరస్వామి ఆలయం శుభ్రతకు కారణం. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నేను చేసిన విధానం. టీటీడీపై లేనిపోని అనుమానాలు కలిగిస్తున్నారు. ఇవన్నీ కుట్రలో భాగమే' అని చంద్రబాబు అన్నారు.

ఓటుకు నోట్ల కేసుపై విచారణ చేపట్టాలి: బొత్స

ఓటుకు నోట్ల కేసుపై విచారణ చేపట్టాలి: బొత్స

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి ఉండి, ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయిన చంద్రబాబు ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్టణంలో ధర్మపోరాట దీక్షను చంద్రబాబు ఎందుకు చేశారో అర్థం కావట్లేదని అన్నారు. రాజకీయ లబ్ది కోసం, ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు చేస్తున్నదే ఈ ధర్మపోరాట దీక్ష అని విమర్శించారు.