Short News

ఒకేసారి రెండు 4G ఓల్ట్  సిమ్‌లు వేసుకోవచ్చు

ఒకేసారి రెండు 4G ఓల్ట్ సిమ్‌లు వేసుకోవచ్చు

ఇక నుంచి స్మార్ట్ ఫోన్లలో రెండు సిమ్ లకు వోల్ట్ సౌకర్యం పొందవచ్చు. ఇప్పటివరకు రెండు సిమ్ కార్డులు ఉన్నవారు ఒకసారి కేవలం ఒక సిమ్ ద్వారా మాత్రమే వోల్ట్ సేవలు అందుకోటానికి వీలుపడుతుంది. ఈ నేపథ్యంలో ఇకపై రాబోయే అనేక ఫోన్లు ఒకేసారి రెండు సిమ్ లకు వోల్ట్ కలిగి ఉండనున్నాయి.  ఇప్పటికే మార్కెట్లో విడుదలైన నోట్ 5 ప్రో ఫోన్లో ఈ సదుపాయం లభిస్తోంది. అయితే ప్రస్తుతానికి ఆపరేటింగ్ సిస్టం లో అంతర్భాగంగా ఈ సదుపాయం ఉన్నప్పటికీ భారతీయ వినియోగదారులకు ఇది లాక్ చేయబడి ఉంది. అతి త్వరలో భారత్ లోనూ అందుబాటులోకి రానుంది.
మరో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

మరో ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టుల మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సల్స్‌ మరణించారు. అదే జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 16 మంది నక్సల్స్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఐజీ శరద్‌ షెలార్‌ తెలిపారు. అయితే ఎంతమంది మరణించారన్న దానిపై కచ్చితమైన లెక్క లేకపోయినా కనీసం ఆరుగురు మరణించారని చెప్పారు.

నాతో 15 నిమిషాల చర్చకు సిద్ధమా: మోడీకి రాహుల్ సవాల్

నాతో 15 నిమిషాల చర్చకు సిద్ధమా: మోడీకి రాహుల్ సవాల్

'సేవ్‌ ది కాన్‌స్టిట్యూషన్‌(రాజ్యాంగ పరిరక్షణ)' ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ సవాలు విసిరారు రాహుల్. రాహుల్‌ గాంధీ సోమవారం 'సేవ్‌ ది కన్‌స్టిట్యూషన్‌' కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ' ప్రధాని మోడీ నన్ను పార్లమెంటులో ఎదుర్కోలేరు. నాతో కనీసం 15 నిమిషాల పాటు చర్చకు కూడా ధైర్యం చేయలేరు. ఇప్పుడు ఆయన దృష్టంతా మళ్లీ ప్రధాని కావడం మీదే ఉంది. మోడీజీ నాతో చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా?' అంటూ రాహుల్ గాంధీ సవాల్‌ విసిరారు.

లోకేష్‌పై చంద్రబాబు ప్రశంసలు

లోకేష్‌పై చంద్రబాబు ప్రశంసలు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి లోకేష్‌కు టెక్నాలజీపై మంచి పట్టుందని చెప్పారు. మ‌న ఐటీ మంత్రి ప్రొఫెషనల్‌ అని, ఐటీలో లోకేష్‌కు మంచి పట్టుందని చెప్పారు. తాను మేనేజర్, లీడర్‌ను మాత్రమేనని.. సూచనలు ఇస్తుంటానని చెప్పారు. సాంకేతికత చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రస్తుతం ఐటీ వేదికగా నాలుగో పారిశ్రామిక విప్లవం నడుస్తోందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.