Short News

జీమెయిల్ లో త్వరలో అద్భుతమైన ఫీచర్లు

జీమెయిల్ లో త్వరలో అద్భుతమైన ఫీచర్లు

జీమెయిల్ కు సరికొత్త ఫీచర్లను తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించింది. ‘కాన్ఫిడెన్షియల్ మోడ్' ఫీచర్ తో ఎవరికైనా మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ ను వారు మరొకరికి ఫార్వార్డ్ చేయకుండా చేసుకోవచ్చు. పంపిన మెయిల్ ను కాపీ చేయడం కానీ, ప్రింట్ తీసుకునే అవకాశం కానీ ఉండదు. అలాగే, వచ్చిన మెయిల్స్ ను ఓపెన్ చేసి చదవాలంటే పాస్ కోడ్ అవసరం. ఈ పాస్ కోడ్ ను టెక్ట్స్ సందేశం ద్వారా గూగుల్ పంపిస్తుంది. అంతేకాదు, పంపిన మెయిల్స్ కు ఎక్స్ పయిరీ తేదీ కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే నిర్ణీత సమయం తర్వాత అవి డిలీట్ అయిపోతాయి
సాల్మొనెల్లా బాక్టీరియా ఎగ్స్ లోకి ఎలా ప్రవేశిస్తుంది?

సాల్మొనెల్లా బాక్టీరియా ఎగ్స్ లోకి ఎలా ప్రవేశిస్తుంది?

తాజాగా, శుభ్రంగా, క్రాక్ అవని ఎగ్స్ లో కూడా సాల్మొనెల్లా బాక్టీరియా ఉంటుందని ఇటీవలి అధ్యయనం స్పష్టం చేస్తోంది. వీటిని తీసుకుంటే అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. యూ.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( FDA) ప్రకారం 79,000 ఫుడ్ బర్న్ ఇల్ నెస్ కేసులతో పాటు 30 మరణాలు సాల్మొనెల్లా బాక్టీరియా వలన సంభవించాయని తెలుస్తోంది. ఇది, నిజంగా షాక్ కు గురిచేసే విషయం.

సాల్మొనెల్లా బాక్టీరియా అంటే ఏంటి?

ఒక బాక్టీరియా సమూహాని

తొలిసారి సైనిక స్కూలులో బాలికలకు ప్రవేశం

తొలిసారి సైనిక స్కూలులో బాలికలకు ప్రవేశం

దేశంలోనే మొట్టమొదటిసారి సైనిక్ స్కూలులో బాలికలకు కూడా ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. 57 ఏళ్ళ తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం దేశ భద్రతాదళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే బాలికల కలను సాకారం చేస్తుందని కల్నల్ అమిత్ చటర్జీ ప్రకటించారు. 15 మంది బాలికలను లక్నోలోని సైనిక స్కూలులో 9వతరగతిలో చేర్చుకునేందుకు మొట్టమొదటిసారి అవకాశం కల్పించారు. సైనిక స్కూలులో విద్యనభ్యసించడం తమకెంతో గర్వంగా ఉందని విద్యార్థినులు చెప్తున్నారు. దేశంలో మొత్తం 28 సైనిక స్కూళ్ళు, 5 మిలటరీ స్కూళ్ళు ఉన్నాయి.
2019 వన్డే వరల్డ్‌ కప్‌లో కోహ్లీ సేనే ఫేవరేట్‌

2019 వన్డే వరల్డ్‌ కప్‌లో కోహ్లీ సేనే ఫేవరేట్‌

2019 ఐసీసీ వరల్డ్‌ కప్‌లో కోహ్లీ సేన ఫేవరేట్‌గా బరిలోకి దిగనుందని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. కోల్‌కతాలో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌ మాట్లాడుతూ 'ఇంగ్లాండ్‌లో జరుగనున్న ప్రపంచకప్‌ను భారత జట్టే గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసాడు. ప్రస్తుత జట్టు విదేశీ గడ్డపై ఎక్కడైనా మెరుగైన ప్రదర్శన చేయగల సత్తా ఉందని నిరూపించుకుందన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా మంచి బంతులు వేయగల బౌలింగ్‌ లైనప్‌ ఉందన్నాడు.