Short News

గూగుల్‌‌ ‘ఆండ్రాయిడ్‌ పి' అంటే..‘ఆండ్రాయిడ్‌ పిస్తాచియో’.?

గూగుల్‌‌ ‘ఆండ్రాయిడ్‌ పి' అంటే..‘ఆండ్రాయిడ్‌ పిస్తాచియో’.?

ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌‌ త్వరలోనే ‘ఆండ్రాయిడ్‌ పి' విడుదల చేయనుంది. ఇప్పటికే దీని ఫీచర్లను గూగుల్‌ వెల్లడించింది. ప్రస్తుతం బీటాను టెస్టు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఆండ్రాయిడ్‌' పి అంటే ఏంటని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్‌ పి అంటే పీనట్‌ బటర్‌, పాన్‌కేక్‌ అనే పేర్లు వినిపించాయి. కానీ, అనుకోకుండా హువావే పాలిష్‌కు చెందిన ఓ కస్టమర్‌ ప్రతినిధి ఆండ్రాయిడ్‌ పి పేరు బయటపెట్టాడట.‘పి'ని కోట్‌ చేస్తూ ‘ఆండ్రాయిడ్‌ పిస్తాచియో' అని చెప్పేశాడు. దీనిని ఆండ్రాయిడ్‌ పిస్తా ఐస్‌క్రీమ్‌గా పిలిచే అవకాశం ఉందని అంటున్నారు.
సినీ న‌టులు భ‌య‌ప‌డ‌కూడ‌దు

సినీ న‌టులు భ‌య‌ప‌డ‌కూడ‌దు

సినీ నటులు భయపడకూడదని బాలీవుడ్‌ నటి కాజోల్‌ అంటున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి పర్‌ఫెక్ట్‌ కాదని, పర్‌ఫెక్ట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ‘ఈ వృత్తి (నటన)లో భయం అనేది ఉండకూడదు. మనమంతా పర్‌ఫెక్ట్‌గా లేమన్న విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. కేవలం నేనే కాదు.. మనమంతా ఈ తరగతిలోకి వస్తాం. వీలైనంత మానవత్వంతో జీవించడానికి ప్రయత్నిస్తున్నాం' అని కాజోల్‌ అన్నారు.   
40 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ లో మళ్లీ ముందస్తు బెయిల్

40 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ లో మళ్లీ ముందస్తు బెయిల్

నాలుగు దశాబ్దాల తర్వాత ముందస్తు బెయిల్‌కు సంబంధించిన చట్టాన్ని తిరిగి తీసుకురావడానికి మళ్లీ ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని సోమవారం యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఇప్పటి వరకు యూపీ, ఉత్తరాఖండ్‌లలో మాత్రమే ముందస్తు బెయిల్‌ పొందే అవకాశం లేదు. ఈ ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో నేరస్థులు అరెస్టు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ ఆప్షన్‌ను ఈ రెండు రాష్ట్రాల్లో అందుబాటులో లేకుండా చేశారు.
ల‌వ‌ర్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్

ల‌వ‌ర్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్

రాజ్‌ తరుణ్‌, అనీష్ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా లవర్. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్‌గా రిధి కుమార్‌ నటించింది. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో రాజ్ తరుణ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మూవీ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more