Short News

‘ఐఫోన్ ఎక్స్’ ఓఎస్ తరహాలో ఆండ్రాయిడ్ పి..?

‘ఐఫోన్ ఎక్స్’ ఓఎస్ తరహాలో ఆండ్రాయిడ్ పి..?

యాపిల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఓస్ తరహా ఫీచర్లను గూగుల్ కూడా తన ఆండ్రాయిడ్ పి ఆపరేటింగ్ సిస్టమ్‌లో అందించనున్నట్లు తెలిసింది. గూగుల్ సంస్థ త్వరలో తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ పి ని విడుదల చేయనుంది. అయితే అందులో ఐఫోన్ X ఓఎస్ తరహాలో గెస్చర్ కంట్రోల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు ప్రస్తుతం నెట్‌లో లీకయ్యాయి. అయితే దీనిపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు. త్వరలో జరగనున్న గూగుల్ ఐ/వో 2018 సదస్సులో ఆండ్రాయిడ్ పి గురించిన విశేషాలను వెల్లడించే అవకాశం ఉంది.
క్రిస్‌గేల్‌పై షేన్ వాట్సన్ ప్రశంసలు

క్రిస్‌గేల్‌పై షేన్ వాట్సన్ ప్రశంసలు

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ క్రిస్‌గేల్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన వాట్సన్ విండీస్ స్టార్ క్రిస్‌గేల్ ప్రదర్శనను కొనియాడాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్. చాలా టీ20 శతకాలు సునాయాసంగా సాధించాడు. ఆ అసాధారణ ప్రదర్శన కారణంగానే అతడు యూనివర్స్ బాస్ అయ్యాడు. అతను ప్రపంచవ్యాప్తంగా ఎదురుదాడికి దిగి మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడని ఆసీస్ ఆల్‌రౌండర్ పేర్కొన్నాడు.
‘టోట‌ల్ డమాల్’ ఫస్ట్ లుక్ చూశారా.?

‘టోట‌ల్ డమాల్’ ఫస్ట్ లుక్ చూశారా.?

బాలీవుడ్ లో మరో సారి క్రేజీ కాంబోతో టోట‌ల్ డమాల్ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు ఇంద్ర‌కుమార్‌. తాజాగా అనీల్ క‌పూర్‌, మాధురీ దీక్షిత్‌ల ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. చిత్రానికి సంబంధించిన పిక్ అనే టాక్ వినిపిస్తుండ‌గా, ఇందులో మాధురీ దీక్షిత్ భుజంపై రెండు చేతులు వేసి డిఫ‌రెంట్ స్టిల్ ఇచ్చాడు అనీల్ క‌పూర్‌. కామెడీ యాంగిల్ లో ఈ మూవీని దర్శకుడు తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అభిమనుల మనసులలో చిరస్థాయిగా నిలిచేలా తమ చిత్రం ఉంటుందని దర్శకుడు ఇంద్ర కుమార్ అంటున్నారు.
జాహ్నవి హ్యాపీ మూడ్.. సెలబ్రేషన్స్‌లో శ్రీదేవి కూతురు!

జాహ్నవి హ్యాపీ మూడ్.. సెలబ్రేషన్స్‌లో శ్రీదేవి కూతురు!

దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవిని ఓ వైపు విషాదాన్ని దిగమింగుతూ తన తొలి సినిమాను పూర్తి చేసింది. యువ హీరో ఇషాన్ కట్టర్‌తో ఆమె నటిస్తున్న దఢక్ చిత్ర షూటింగ్ పూర్తయింది. దాంతో జాహ్నవి, ఇషాన్ ఇద్దరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకొన్నారు. దఢక్ షూటింగ్ పూర్తయిన రోజే తన తొలి సినిమా బియాండ్ ది క్లౌడ్స్ రిలీజ్ కావడంతో ఇషాన్ ఆనందం రెండితలైంది. దఢక్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు శశాంక్ ఖైతాన్, జాహ్నవి తండ్రి, నిర్మాత బోనికపూర్ తదితరులు హాజరయ్యారు.