
క్యాస్టింగ్ కౌచ్ అంశంతో టాలీవుడ్లో రచ్చ రచ్చ చేస్తున్న శ్రీరెడ్డి మరో ఆసక్తికరమైన సోషల్ మీడియాలోని ట్విట్టర్లోకి ప్రవేశించారు. 'శ్రీ శక్తి' పేరుతో తాను ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌లోనే దుమ్మురేపిన ఈ నటి తాజాగా ట్విట్టర్లో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇటీవల మా అసోసియేషన్‌పై నిరసన వ్యక్తం చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం జాతీయ మీడియాలో సంచలనం రేపింది. ఇలా వివాదాలతో ముందుకెళ్తున్న శ్రీరెడ్డి.. ఏకంగా మంత్రి కేటీఆర్‌కు ఓ ట్వీట్ చేసింది.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ మధ్య ఏంఎల్ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా తరువాత నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజా సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. నా నువ్వే తర్వాత కోన వెంకట్ చేప్పిన కథతో సినిమా చేయల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్‌ను నిలిపివేసినట్టు సమాచారం.కళ్యాణ్ రామ్ ఏంఎల్ఏ సినిమాతో సక్సెస్ చేజిక్కించుకొన్నాడు. అదే ఊపుతో నా నువ్వే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.