Short News

రూ.5వేలకే హువావే ‘హానర్ 10’

రూ.5వేలకే హువావే ‘హానర్ 10’

హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ 'హానర్ 10'ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఫాంటమ్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ రూ.32,999 ధరకు వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది. ఈ ఫోన్‌లో 5.84 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 16, 24 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. తడి వేళ్లతోనూ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పనిచేస్తుంది. హానర్ 10తో ఇతర స్మార్ట్‌ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.5వేల వరకు ఎక్స్‌ట్రా వాల్యూను ఇస్తున్నారు. అలాగే నోకాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
సుస్మితా సేన్‌ ఇప్పటికీ 'మిస్‌' యూనివర్సే

సుస్మితా సేన్‌ ఇప్పటికీ 'మిస్‌' యూనివర్సే

బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌ విశ్వసుందరి కిరీటం సాధించి నేటికి 24ఏళ్ళు అవుతోంది. 18 ఏళ్ళ వయసులో ఆమె ఆ కిరీటం అందుకున్నారు. అయినా ఇప్పటికీ తాను 'మిస్‌' యూనివర్స్‌నే అని సుస్మిత అంటున్నారు. 'నేను విశ్వసుందరి కిరీటం సాధించినప్పుడు నా వయసు 18. ఇప్పుడు నా వయసు 42. ఇప్పటికీ నేను 'మిస్‌' యూనివర్స్‌నే. నాకు కానుకలు, లెటర్లు పంపుతున్నవారందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నేను భారత్‌లో, నా రెండో నివాసమైన ఫిలిప్పీన్స్‌లో వేడుకలు చేసుకోవాలని అనుకుంటున్నాను' అని పేర్కొన్నారు. సుస్మితకు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఒకటి చేయాలని ఉందట.
హీరో నుండి హైస్పీడ్ ఎలక్ట్రిక్  స్కూటర్

హీరో నుండి హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

భారతదేశపు అతి పెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ విపణిలోకి సరికొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. హీరో ఎలక్ట్రిక్ నుండి వస్తున్న ఈ నూతన మోడల్ పర్ఫామెన్స్ మరియు రేంజ్ రెండింటిని లక్ష్యంగా చేసుకొని రానుంది.

హీరో ఎలక్ట్రిక్ AXHLE-20 అనే కోడ్ పేరుతో ఓ హై స్పీడ్ స్కూటర్‌‌ను పరిచయం చేయడానికి సిద్దమైంది. ఈ స్కూటర్ హీరో లైనప్‌లో టాప్ బ్రాండ్‌గా నిలవనుంది. అంతే కాకుండా హై స్పీడ్ సిరీస్ అనే సెగ్మెంటుకు చెందిన స్కూటర్‌గా మార్కెట్లోకి రానుంది.

కూల్ మూమెంట్: ప్రకృతిని ఆస్వాదిస్తూ, శక్తిని పెంచుకుంటూ.. మెగా పవర్ స్టార్ రాంచరణ్!

కూల్ మూమెంట్: ప్రకృతిని ఆస్వాదిస్తూ, శక్తిని పెంచుకుంటూ.. మెగా పవర్ స్టార్ రాంచరణ్!


మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి చిత్రంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. తన భర్త విశేషాలని ఎప్పటికప్పుడు అభిమానులకు తెలియజేస్తున్న ఉపాసన తాజాగా రాంచరణ్ కూల్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పచ్చని ప్రకృతి మధ్యలో కాఫీ తాగుతూ రాంచరణ్ కనిపిస్తున్నాడు.