Short News

ట్విట్టర్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా?

ట్విట్టర్ హిస్టరీని డిలీట్ చేయడం ఎలా?

• సోషల్ మీడియా...మన జీవితంలో ఒక భాగం అయ్యింది. స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు....ఇలా మీరు సోషల్ మీడియాలో ఎలా యాక్టివ్ గా ఉన్నారో చూసి మీ మీద ఒక అంచనాకు వస్తారు.

• అలాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ట్విట్టర్ కూడా ఒకటి. ట్విట్టర్లో మీరు బాగా యాక్టివ్ గా ఉన్నట్లయితే...ట్విట్టర్ హిస్టరీ గురించి కొంచెం పట్టించుకోవల్సిందే.

• పాత ట్విట్టర్ హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.

కుప్పకూలిన భవనం: ఒకరు మృతి, మరొకరికి గాయాలు

కుప్పకూలిన భవనం: ఒకరు మృతి, మరొకరికి గాయాలు

హైదరాబాద్‌ చందానగర్‌ హుడా కాలనీలో పాత భవనం కూల్చివేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్లాబు ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న భవన నిర్మాణ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ హఫీజ్‌పేట్‌ డివిజన్‌లోని హుడాకాలనీలో నివాసముండే రాంచందర్‌ తన ఇంటిని పునర్నిర్మాణం చేయడానికి కూల్చివేసే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాంట్రాక్టర్‌ యాదగిరి ఐదుగురు కూలీలతో పురాతన భవనాన్ని కూల్చివేసే పనులను ప్రారంభించారు.

పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ: నలుగురు మృతి

పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ: నలుగురు మృతి

అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.పెళ్లి బృందంతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌‌ను ఓ లారీ ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన ఓడీసీ మండలం గాజుకుంటపల్లి వద్ద చోటుచేసుకుంది. పెళ్లి ట్రాక్టర్‌ దిగువపల్లి నుంచి కదిరికి వెళ్తోంది. వేగంగా ప్రయాణిస్తున్న లారీ.. పెళ్లి ట్రాక్టర్‌ను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా, పలువురు గాయలయ్యాయి.

పవన్-జగన్‌ది ఒకేదారి, కేంద్రం ఆట: చంద్రబాబు

పవన్-జగన్‌ది ఒకేదారి, కేంద్రం ఆట: చంద్రబాబు

కేంద్ర వైఖరికి నిరసనగా తిరుపతిలో నిర్వహించనున్న సభ ఏర్పాట్లను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం రాత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. తిరుపతి సభకు పోటీగా వైసీపీ విశాఖ సభ నిర్వహిస్తోందని చంద్రబాబు తెలిపారు. జగన్‌-పవన్‌ ఇద్దరూ ఒకే దారిలో వెళ్తున్నారని అయన అభిప్రాయపడ్డారు. పవన్‌ కళ్యాన్ వ్యాఖ్యలు తనను చాలా బాధించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిరాధార ఆరోపణలతో ఆయన సాధించేదేమీ లేదని అభిప్రాయపడ్డారు.