Short News

ప్లేస్టోర్‌లో ఫేక్ అప్లికేషన్స్‌ను గుర్తించడం ఎలా ?

ప్లేస్టోర్‌లో ఫేక్ అప్లికేషన్స్‌ను గుర్తించడం ఎలా ?

ప్రతిరోజూ వందల వేలల్లో పుట్టుకొస్తున్న ఫేక్ అప్లికేషన్స్ ను అరికట్టడానికి గూగుల్ సరికొత్త సెక్యూరిటీ సిస్టమ్ ను ఏర్పరచింది. అదే గూగుల్ ప్రొటెక్ట్. క్రమంగా ప్లే స్టోర్ నుండి 7,00,000 ఫేక్ మరియు అసురక్షితమైన అప్లికేషన్స్ ను తొలగించడం జరిగినది. అయినా కూడా ఇంకా అనేక ఫేక్ అప్లికేషన్స్ ప్లే- ప్రొటెక్ట్ ను కూడా దాటి ప్లేస్టోర్ లో కనిపిస్తూ వినియోగదారుల అసహనానికి కారణం అవుతున్నాయి ఉన్నాయి.ఫేక్ అప్లికేషన్స్, కొన్ని అనవసర పర్మిషన్స్ తీసుకోవడం ద్వారా మీడియా , లొకేషన్, కాంటాక్ట్స్ వంటి భద్రతాపరమైన వనరులను తస్కరించే ప్రయత్నాలు చేస్తుంటాయి.

ఉచితంగా 'హార్లీ డేవిడ్సన్‌' బైక్

ఉచితంగా 'హార్లీ డేవిడ్సన్‌' బైక్

ప్రముఖ బైక్‌ల కంపెనీ హార్లీ డేవిడ్సన్‌ 'హార్లీ డేవిడ్సన్‌' బైక్‌ని ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ వేసవిలో హార్లీ డేవిడ్సన్‌ కంపెనీలో 12వారాల పాటు ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ఎంపికైన అభ్యర్థులకు ఒక బైక్‌ను ఇస్తారు. అభ్యర్థులు ఈ బైక్‌ల మీద విహరించి తమ అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలి. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా అభ్యర్థులకు బైక్‌ని ఎలా నడపాలి అనే విషయంలో శిక్షణ ఇవ్వడమే కాక వారికి ప్రయాణ ఖర్చులతో పాటు వేతనాన్ని కూడా చెల్లిస్తారు. 18 ఏళ్ళు నిండిన పట్టభద్రులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేది 2018, మే 11.  
రామ మందిరం తీర్పు అనుకూలంగా రాకుంటే ఆత్మాహుతులు!

రామ మందిరం తీర్పు అనుకూలంగా రాకుంటే ఆత్మాహుతులు!

బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామ మందిరం కేసులో సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకుంటే ఆత్మాహుతి దళాలు (బలిదానీ దాస్తా) రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనంత వరకు ఈ దళాలు ముందుకు రావు, అయితే వాటికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది అని లక్నోలో ఆయన మీడియాతో చెప్పారు. బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా ఉన్న ఇక్బాల్ అన్సారీకి ఈ వివాదంపై పూర్తి అవగాహన లేదని కటియార్ చెప్పారు. కటియార్ బాబ్రీ మసీదు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు.    
పదిమందితో జియో ఫోన్ కొనిపిస్తే ..112 జీబీ డేటా ఉచితం

పదిమందితో జియో ఫోన్ కొనిపిస్తే ..112 జీబీ డేటా ఉచితం

రిలయన్స్‌ జియో వినియోగదారులకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించింది. ఈసారి ఉచిత డేటా ఆఫర్‌ ప్రకటించింది. 'జియో ఫోన్‌ మ్యాచ్‌ పాస్‌' ఆఫర్లో వినియోగదారులు మరో 10మంది చేత జియో ఫోన్లను కొనిపిస్తే 112 జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫర్‌ మే 27వ తేదీవరకు మాత్రమే చెల్లుతుంది. 10మంది స్నేహితులు లేదా, బంధువులను జియో ఫోన్‌ కొనుగోలు చేయించాల్సి ఉంటుంది. 1800-890-8900 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి జియో ఫోన్‌పై ఆసక్తి ఉన్న స్నేహితుల గురించి సమాచారం ఇవ్వాలి.