Short News

మీ పాస్‌వర్డ్ దొంగిలించబడిందో లేదో తెలుసుకోవడం ఎలా ?

మీ పాస్‌వర్డ్ దొంగిలించబడిందో లేదో తెలుసుకోవడం ఎలా ?

ఈ డిజిటల్ ప్రపంచం మనం అనుకున్నంత సురక్షితం కాదు. ఏమాత్రం ఆలోచన లేకుండానే, మనసుకు తోచిన ప్రతి వెబ్సైట్ లోనూ మన వివరాలతో సైన్-అప్ చేస్తుంటాం. కానీ ఇలాంటి అనేక వెబ్సైట్స్ చౌర్యానికి గురవడం వలన, వినియోగదారుల వివరాలకు భద్రతలేకుండా పోతుంది. తద్వారా పాస్వోర్డ్స్ చౌర్యం జరిగి, మీ అకౌంట్స్ సులభంగా హాక్ కు గురయ్యే అవకాశం ఉంది. కావున మీ అకౌంట్ వివరాలు దొంగిలించబడినవో లేదో తెలుసుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. మీ పాస్వోర్డ్ ఇప్పటికీ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని పద్దతులను మీముందు ఉంచుతున్నాం.

వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష యాత్ర మొదలైంది

వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష యాత్ర మొదలైంది

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ అంతరిక్ష యాత్రకు రెడీ అవుతున్నాడు. సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్ష నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. దర్శకుడు క్రిష్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గురువారం ప్రారంభించారు. అదితి రావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా కోసం లీడ్ యాక్టర్స్‌ కొద్ది రోజులుగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకుంటున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాలో వ్యోమగామిగా కనిపించనున్నాడట.  
బాలకృష్ణ ఎన్ని సార్లు అలా మాట్లాడలేదు.. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే టార్గెట్, ఎందుకో మాకు తెలుసు!

బాలకృష్ణ ఎన్ని సార్లు అలా మాట్లాడలేదు.. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే టార్గెట్, ఎందుకో మాకు తెలుసు!

శ్రీరెడ్డి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా మారడం వెనుక ఉన్న కుట్రలు తనకు తెలుసు అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ అన్నారు. శ్రీరెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారుతుండడంతో ఆయన టీవీ9 తో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ట్రోలింగ్ వలనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలకు ఆయన ధీటైన సమాధానం ఇచ్చారు.పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ట్రోలింగ్ చేయరని అన్నారు. ట్రోలింగ్ చేస్తున్న వారంతా పవన్ కళ్యాణ్ అభిమానులే అని గ్యారెంటీ ఉందా అంటూ ప్రశ్నించారు.

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

ఈఐఎల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 67 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 11, 2018 నుంచి మే 2, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
ఖాళీల సంఖ్య: 67
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: మే 2, 2018
జీతం వివరాలు: రూ. 60,000 - 1,80,000/-
విద్యార్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) పూర్తి కాలం ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు
వయో పరిమితి: జనరల్: 25ఏళ్లు, ఓబీసీ: 28ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ: 30ఏళ్లు.