Short News

నవంబర్ లోనే మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌ విడుదల.?

నవంబర్ లోనే మడతపెట్టే స్మార్ట్‌ఫోన్‌ విడుదల.?

ప్రపంచంలోనే మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ ఈ ఏడాది నవంబర్ లో విడుదల కానుంది. హువావే సంస్థ ఈ మడతపెట్టే ఫోన్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్‌ప్లే ఉంటుందని తెలిసింది. దీన్ని ఎల్‌జీ సంస్థ తయారు చేసి హువావేకు ఇస్తున్నదట. మరోవైపు ఇప్పటికే ఇలాంటి మడతబెట్టే స్మార్ట్‌ఫోన్ తయారీలో శాంసంగ్ కంపెనీ నిమగ్నం కాగా ఇప్పుడు హువావే చేసిన ప్రకటన ఆసక్తిగా నిలిచింది. దీంతో ఈ రెండు సంస్థల్లో మొదట ఏ సంస్థ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
యడ్యూరప్పకు బీజేపీ ఊహించని షాక్

యడ్యూరప్పకు బీజేపీ ఊహించని షాక్

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆశాలపై బీజేపీ నీళ్ల చల్లింది. కుమారుడు విజయేంద్రతోపాటు, సన్నిహితురాలు శోభా కరాంద్లజే (యశ్వంత్‌పూర్‌ కోసం) లకు సోమవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ చోటు దక్కలేదు. ఆయన కుమారుడికి సీటివ్వడం లేదని పార్టీ అధిష్ఠానం తేల్చిచెప్పింది. అటు, రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్‌ అధికారి రేవణ్ణ సిద్దయ్య (లింగాయత్‌ వర్గం బలమైన నాయకుడు)కు వరుణ నుంచి బీ-ఫామ్‌ ఇచ్చే అవకాశముంది.
వారిద్దరికి వాట్సప్ పెళ్లి చేసింది

వారిద్దరికి వాట్సప్ పెళ్లి చేసింది

యువతి,యువకుడికి వాట్సప్ పెళ్లి చేసింది.అవును నిజం. అయితే వీరిద్దరికి మాటలురావు, చెవులు వినిపించవు. వారిద్దరి పరిచయం వాట్సప్‌ ద్వారా జరిగింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వివాహ భాగ్యంతో ఒక్కటయ్యారు.  ప్రైవేటు కంపెనీలో ఇద్దరి జాబ్ చేస్తుండగా వాట్సప్‌ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆదివారం బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలోని బనశంకరి కళ్యాణ సముదాయంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రలు,స్నేహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకన్నారు.
బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

హిందీ బిగ్‌బాస్‌కు స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌ని తీసుకోవాల‌ని నిర్వాహకులు భావిస్తున్నార‌ట‌. మాజీ ప్రేమికులైన వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబ‌ట్టి, ఇద్దరు క‌లిసి షో చేస్తే మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నారట. బిగ్‌బాస్‌ సీజ‌న్‌12 కి కూడా స‌ల్మాన్‌ని హోస్ట్‌గా ఎంపికైతే తొమ్మిదోసారి సల్మాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సల్మాన్ తొలిసారి 2010లో బిగ్‌బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా వ్యవహరించాడు. 2011లో బిగ్‌బాస్ 5ని సంజయ్‌దత్ హోస్ట్ చేశాడు.