Short News

ఎంఐ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక ఆ ఫోన్ దొరకదు

ఎంఐ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక ఆ ఫోన్ దొరకదు

ఎంఐ అభిమానులకు చేదువార్త. ఎంఐ ఏ1 ఇక నుంచి భారత్‌లో లభ్యం కాదట. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇక నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో కానీ కంపెనీ అధికారిక సెల్లింగ్‌ పార్టనర్‌ వద్ద కానీ అమ్మకానికి లభ్యం కాదని కంపెనీ తెలిపింది. ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్లోనే లాంచ్‌ అయిన సంగతి తెలిసిందే.అయితే ఎంఐ ఇప్పటి వరకు లాంచ్‌చేసిన ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఇంత త్వరగా నిలిపివేయలేదు. మరోవైపు ఎంఐ 6ఎక్స్‌ అక్కా ఎంఐ ఏ2 చైనాలో ఈ నెల 25న లాంచ్‌ కాబోతోన్నట్లు సమాచారం.
వారిద్దరికి వాట్సప్ పెళ్లి చేసింది

వారిద్దరికి వాట్సప్ పెళ్లి చేసింది

యువతి,యువకుడికి వాట్సప్ పెళ్లి చేసింది.అవును నిజం. అయితే వీరిద్దరికి మాటలురావు, చెవులు వినిపించవు. వారిద్దరి పరిచయం వాట్సప్‌ ద్వారా జరిగింది.ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వివాహ భాగ్యంతో ఒక్కటయ్యారు.  ప్రైవేటు కంపెనీలో ఇద్దరి జాబ్ చేస్తుండగా వాట్సప్‌ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆదివారం బళ్లారి జిల్లా కొట్టూరు పట్టణంలోని బనశంకరి కళ్యాణ సముదాయంలో కుటుంబసభ్యులు, బంధుమిత్రలు,స్నేహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకన్నారు.
బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

బిగ్‌బాస్‌ షోలో స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌

హిందీ బిగ్‌బాస్‌కు స‌ల్మాన్‌కి కోహోస్ట్‌గా క‌త్రినా కైఫ్‌ని తీసుకోవాల‌ని నిర్వాహకులు భావిస్తున్నార‌ట‌. మాజీ ప్రేమికులైన వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుంటుంది కాబ‌ట్టి, ఇద్దరు క‌లిసి షో చేస్తే మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంద‌ని ఆలోచిస్తున్నారట. బిగ్‌బాస్‌ సీజ‌న్‌12 కి కూడా స‌ల్మాన్‌ని హోస్ట్‌గా ఎంపికైతే తొమ్మిదోసారి సల్మాన్ ఈ షోని హోస్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సల్మాన్ తొలిసారి 2010లో బిగ్‌బాస్ సీజన్ 4కు హోస్ట్‌గా వ్యవహరించాడు. 2011లో బిగ్‌బాస్ 5ని సంజయ్‌దత్ హోస్ట్ చేశాడు.
సెక్స్‌వర్కర్లుగా మారుతుంది అందుకే...భూమి ఇవ్వండి

సెక్స్‌వర్కర్లుగా మారుతుంది అందుకే...భూమి ఇవ్వండి

అమరావతి: సెక్స్‌వర్కర్లకు పునరావాసం కోసం ఒక్కొక్కరికి 2 ఎకరాల భూమి ఇవ్వాలని స్వచ్ఛంద సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించాయి. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది యువతులు, బాలికలు వ్యభిచారకూపంలోకి దిగుతున్నారని పలువురు సామాజిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
మానవ అక్రమ రవాణాపై సోమవారం సచివాలయంలో ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత పర్యవేక్షణలో ఈ వర్క్ షాప్ నిర్వహణ జరిగింది.