Short News

ఐడియా రూ.249 ప్లాన్‌ ..56జీబీ డేటా

ఐడియా రూ.249 ప్లాన్‌ ..56జీబీ డేటా

ఐడియా సెల్యులార్‌ సరికొత్త ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఎయిర్‌టెల్‌ రూ.249 రూపాయల ప్యాక్‌కు పోటీగా దీనిని తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌ కింద రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటాను, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, ఉచిత ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలను అందించనున్నట్టు పేర్కొంది. 28 రోజులు వాలిడిటీతో మొత్తంగా ఐడియా 56జీబీ డేటాను అందించనుంది.  ప్రస్తుతం ఈ ప్యాక్‌ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్‌ రోజుకు 2జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 28 రోజుల పాటు ఆఫర్‌ చేస్తోంది.
భారత ఆటగాళ్ళలో మూడో సారధిగా 'కోహ్లీ'

భారత ఆటగాళ్ళలో మూడో సారధిగా 'కోహ్లీ'

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్ కోహ్లీ అత్యధిక టీ20లకు నాయకత్వం వహించిన ఆటగాళ్ళ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో కోహ్లీ ఎనిమిదో వాడు. బుధవారం బెంగళూరు - చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌తో కోహ్లీకి వంద మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. ఈ జాబితాలో ధోనీ 244 మ్యాచ్ లతో అగ్రస్థానంలో ఉండగా గౌతమ్‌ గంభీర్‌ 170 మ్యాచ్ లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకూ కోహ్లీ 234 టీ20లు ఆడగా 57 మ్యాచ్‌లు భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించాడు.  
క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

క‌ర్ణాట‌క‌లో మ్యానిఫెస్టోల ప్ర‌క‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న పార్టీలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మేనిఫెస్టోలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు అనుభవజ్ఞులైన నాయకులను రంగంలోకి దింపడం ద్వారా విజయానికి బాటలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్రమంతటికీ ఒకటి, నియోజక వర్గానికి ఒకటి చొప్పున మేనిఫెస్టోలు రూపొందించనున్నట్లు బీజేపీ అధికార ప్రతినిధి వామన్‌ ఆచార్య తెలిపారు. మంగళూరులో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్య నేతృత్వంలో జేడీఎస్ మ్యానిఫెస్టో రూపొందించ‌నుంది.     
సరికొత్త నోకియా 8 సిరోకో ఫీచర్లు చూస్తారా..!

సరికొత్త నోకియా 8 సిరోకో ఫీచర్లు చూస్తారా..!

నోకియా బ్రాండ్ పేరిట స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న హెచ్ ఎండీ గ్లోబల్ కంపెనీ దూకుడు పెంచింది. నోకియా పేరిట తాజాగా నోకియా సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడళ్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. గూగుల్ యాండ్రాయిడ్ వన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ మోడల్స్ ను విడుదల చేయనున్నాయి. అంటే ఈ మోడల్ ఫోన్లలో కచ్చితంగా యాండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తుంటాయి. అలాగే ప్రతీ రెండేళ్లకు ఒకసారి యాండ్రాయిడ్ వర్షన్ అప్ డేట్స్ కూడా ఇందులో పొందవచ్చు.