Short News

ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్‌ షాట్లు తీసుకుంటున్నారా.!

ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రీన్‌ షాట్లు తీసుకుంటున్నారా.!

సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాదారుడి ప్రైవసీని కట్టుదిట్టం చేయటానికి సిద్ధమైంది. స్క్రీన్‌ షాట్ల, రికార్డింగ్‌ల ద్వారా ఇతరుల పోస్టులను సేవ్‌ చేయకుండా ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతరుల స్టోరీలను స్క్రీన్‌ షాట్ల రూపంలో సేవ్‌ చేయాలనుకుంటే ‘మీరు చేసే పని పోస్టు చేసేవారికి తెలిసిపోతుంద'ని పాప్‌ అప్‌ వస్తుంది. వీడియోల రికార్డింగ్‌ విషయంలోనూ సేఫ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఇన్‌స్టాగ్రామ్‌ భావిస్తున్నట్లు సమాచారం.
తమిళుల 'ప్రీతి'ని కూడా పొందుతా

తమిళుల 'ప్రీతి'ని కూడా పొందుతా

'అర్జున్‌రెడ్డి'తో గుర్తింపు తెచ్చుకున్న నటి షాలిని పాండేకు తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. జీవీ ప్రకాశ్‌ సరసన '100% కాదల్‌', జీవాతో 'గొరిల్లా' చిత్రాల్లో నటిస్తోంది. షాలిని పాండే మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా ప్రేక్షకులు 'ప్రీతి' అనే పిలుస్తున్నారని చెప్పుకొచ్చింది. తెలుగులో లాగే తమిళంలో ప్రేక్షకులను మెప్పిస్తానని ధీమా వ్యక్తం చేసింది. మరికొన్ని చిత్రాల వివరాలను వెల్లడిస్తానని పేర్కొంది.
పెళ్లికొడుకుకు కట్నంగా కొండముచ్చు

పెళ్లికొడుకుకు కట్నంగా కొండముచ్చు

హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కొండముచ్చును వరుడికి కట్నంగా ఇచ్చార‌న్న వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఫతేహాబాద్ జిల్లాలోని తోహానా పట్టణానికి చెందిన సంజయ్ పూనియాకు జింద్ జిల్లాకు చెందిన రీతూ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. రిద్దరికీ ఫిబ్రవరి 11న వివాహం జరిపించారు. వదువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లినప్పుడు పొలం ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడు. ఇక్కడ పంటను కోతులు నాశనం చేయడాన్ని ఆయన చూశారు. త్వరలో  కొండముచ్చును తీసుకురావాలని అనుకుంటున్నానని మామతో చెప్పాడు. దీంతో వధువు తండ్రి చందీ రామ్ కట్నం బహుమతిగా కొండముచ్చును వ‌రుడికి ఇచ్చాడు.
మహిళపై ముఖ్యమంత్రి అత్యాచారం ..?

మహిళపై ముఖ్యమంత్రి అత్యాచారం ..?

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆరోపిస్తుంది. సీఎం నాపై అత్యాచారం చేశాడంటే ప్రజలు కానీ పోలీసులు కానీ నమ్మలేద‌ని చెబుతోంది. త‌న‌పై అత్యాచారం జరిగినప్పుడు పేమా ఖండూ సీఎం పదవిలో లేడంటోంది. ఇప్పుడు ఆయ‌న‌ సీఎం ప‌ద‌విలో ఉండ‌టంతో త‌న మాటలు ఎవ్వరూ నమ్మడం లేదని వాపోతుంది. ఓ మహిళా న్యాయవాది సాయంతో జాతీయ మహిళా సంఘాన్ని ఆశ్రయించింది. న్యాయం కోసం నా తుదిశ్వాస వరకూ పోరాడుతూనే ఉంటాను అని బాధితురాలు తెలిపింది.