Short News

త్వరలో జియో 'హోమ్‌ టీవీ' .?

త్వరలో జియో 'హోమ్‌ టీవీ' .?

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో వేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. త్వరలో జియో మరో సంచలనానికి తెర తీయనుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 'జియో హోమ్‌ టీవీ' పేరిట సరికొత్త సేవలను ప్రారంభించనుందట. అన్ని ఎస్‌డీ ఛానళ్ళను నెలకు రూ.200లకే , ఎస్‌డీ+హెచ్‌డీ(హై డెఫినేషన్‌) ఛానళ్ళను రూ.400కే అందిస్తుందని చెబుతున్నారు. ఎన్‌హేన్సడ్‌ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్‌ మల్టీకాస్ట్‌ సర్వీస్‌(ఈఎంబీఎంఎస్‌) సాంకేతికత ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
'సూర్య 36' షూటింగ్ మొదలుపెట్టేసిన రకుల్

'సూర్య 36' షూటింగ్ మొదలుపెట్టేసిన రకుల్

కోలీవుడ్ నటుడు సూర్య‌ 36వ చిత్రంగా 'ఎన్‌జీకే' అనే చిత్రం చేస్తున్నాడు. సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సాయిప‌ల్ల‌వి నాయిక‌లు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త‌మిళ‌, తెలుగు భాష‌ల‌లో దీపావ‌ళికి రిలీజ్ కానుంది. తమిళనాడు చిత్రపరిశ్రమ చేపట్టిన బంద్ సమసిపోవటంతో చిత్ర బృందం శుక్రవారం నుండి షూటింగ్ మొద‌లు పెట్టింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ టీంతో జాయిన్ అయింది. ఈ చిత్రం తర్వాత సూర్య 37వ చిత్రంగా కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.
ఆదివారం వస్తున్న 'నేలటిక్కెట్టు' టీజర్

ఆదివారం వస్తున్న 'నేలటిక్కెట్టు' టీజర్

రవితేజ నటిస్తున్న చిత్రం 'నేల టిక్కెట్టు'. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయిక. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆదివారం టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాష్‌, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్‌ శ్రీను, పృథ్వీ, సురేఖావాణి, ప్రవీణ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఏబీడీ మెరుపులు.. బెంగళూరు విజయం

ఏబీడీ మెరుపులు.. బెంగళూరు విజయం

దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ రిషబ్ పంత్ మెరుపులతో 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు 18.0 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌ (90) తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసాడు. కెప్టెన్ కోహ్లీ (30) పరుగులు చేసి బౌల్ట్ అందుకున్న అద్భుత క్యాచ్ తో పెవిలియన్ చేరాడు.