Short News

మరో స్కాంలో అడ్డంగా బుక్కయిన రూ.251 స్మార్ట్‌ఫోన్‌ అధినేత, జైలుకే !

మరో స్కాంలో అడ్డంగా బుక్కయిన రూ.251 స్మార్ట్‌ఫోన్‌ అధినేత, జైలుకే !

ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రింగింగ్ బెల్స్ కంపెనీ పేరు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. మేక్ ఇన్ ఇండియా ఇదేనంటూ ఫ్రీడం 251 పేరుతో అందరికీ రూ.251కే స్మార్ట్‌ఫోన్ అందిస్తానంటూ దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించారు. ఆతని మాటలు నమ్మిన చాలామంది డిపాజిట్లు కూడా కట్టారు. అయితే ఫోన్ సంగతి ఏమైపోయిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. అసలు దాని అధినేత ఏమైపోయాడోననే సందేహం చాలామందికి వచ్చింది కూడా. అయితే చాన్నాళ్ల తరువాత ఈ హీరో మళ్లీ ఇంకో వివాదంతో దర్శనమిచ్చారు.

చందాకొచ్చర్‌ తొలగింపు వార్తలు ..ఐసీఐసీఐ షేర్లకు లాభాలు

చందాకొచ్చర్‌ తొలగింపు వార్తలు ..ఐసీఐసీఐ షేర్లకు లాభాలు

ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు సోమవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో చందాకొచ్చర్‌ను సీఈవోగా తప్పించనున్నారని కొన్ని వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తల నేపధ్యంలో స్టాక్‌మార్కెట్‌లో బ్యాంక్‌ షేర్లు భారీగా పెరిగాయి. ఉదయం నుంచి లాభాల్లో సాగిన ఐసీఐసీఐ షేరు విలువ ఒక దశలో 4శాతానికి పైగా పెరిగాయి. బీఎస్‌ఈలో షేరు ధర 3.44శాతం పెరిగి రూ.292 వద్ద ఎన్ఎస్‌ఈలో 3.52శాతం పెరిగి రూ.292.45 వద్ద ట్రేడయ్యాయి. తాత్కాలిక సీఈవోగా సందీప్‌ బక్షీకి నియమించనున్నట్లు వస్తున్న వార్తలే ఐసీఐసీఐ షేర్ల లాభాలకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
తెలంగాణ పోలీస్ వాట్సాప్ గ్రూప్ ప్రారంభం

తెలంగాణ పోలీస్ వాట్సాప్ గ్రూప్ ప్రారంభం

టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందు వరుసలో ఉంటున్నారు. తాజాగా తెలంగాణ పోలీసు వాట్సప్ గ్రూప్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా 60వేల మందితో ఏకకాలంలో సమాచారం మార్పిడికి అవకాశం ఉంటుంది.31 జిల్లాల్లో ఏ సంఘటన జరిగినా సమాచార మార్పిడికి వాట్సప్‌ గ్రూప్‌ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బందికి ఒకేసారి సమాచారం చేరవేసే లక్ష్యంతో ఏర్పాటుచేశామన్నారు.
ఘోరం: భార్యను చంపి బాత్రూంలో పాతిపెట్టాడు

ఘోరం: భార్యను చంపి బాత్రూంలో పాతిపెట్టాడు

విజయనగరం జిల్లాలోని వెంకంపేట ఏజెన్సీలో 2017, అక్టోబర్ మాసంలో రమణమ్మను అత్యంత దారుణంగా హత్య చేసిన ఆమె భర్త నర్సయ్య.. ఆమె మృతదేహాన్ని అప్పుడే నిర్మిస్తున్న బాత్రూం అడుగుభాగంలో పాతిపెట్టాడు. ఆ తర్వాత రమణమ్మ కనిపించడం లేదంటూ ఇతర కుటుంబసభ్యులను నమ్మించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్య కోసం తాను కూడా వెదుకుతున్నట్లు నర్సయ్య అందర్నీ నమ్మించాడు. అయితే, రమణమ్మను హత్య చేసిన నాటి నుంచి నర్సయ్య.. హైదరాబాద్, విశాఖపట్నంలకు తిరుగుతున్నాడు. చివరకు నర్సయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more