Short News

భారత మార్కెట్లోకి షావోమీ 'ఎంఐ టీవీ4'

భారత మార్కెట్లోకి షావోమీ 'ఎంఐ టీవీ4'

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ షావోమీ టీవీ తయారీ రంగంలో ప్రవేశించింది. 'ఎంఐ టీవీ4'ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ టీవీని అత్యంత పలుచగా 4.9ఎంఎం మందం సైజులో తయారు చేసారు. ఫ్రేమ్‌లెస్‌ డిజైన్‌తో వచ్చిన ఈ 55 అంగుళాల 4కే టీవీలో క్వాడ్‌ కోర్‌ 64బిట్‌ ప్రాసెసర్‌ ఏర్పాటు చేసారు. దీని ధర రూ.39,999. దీనిలో మూడు వేరియంట్లు ఉన్నాయి.  ఈ టీవీ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతుంది.  
భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

రెండేళ్ళుగా సహజీవనం చేస్తూ వివాహం చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది. అయితే ఈ కేసులో ప్రియురాలు పాత్ర నిర్ధారణ కావడంతో పూణె సిటీ సెషన్స్ కోర్టు నిందితురాలికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సహజీవనం చేస్తున్న హనుమంతును వివాహం చేసుకోవాలని ప్రియురాలు సరిత కోరింది. అయితే అప్పటికే వివాహమై పిల్లలున్నా హనుమంతు నిరాకరించడంతో దీంతో సరిత హనుమంతును హత్యచేసింది. ఈ కేసులో సరితకు కోర్టు జీవిత ఖైదును విధించింది.

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

నితిన్ నటిస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో చల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజగా చిత్ర యూనిట్ ఆహ్లాదకరమైన మెలోడీ సాంగ్ ని విడుదల చేసింది. నితిన్, హీరోయిన్ మేఘ ఆకాష్ మధ్య సంభాషణతో ఈ సాంగ్ ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్ చాలా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. సంగీతం వినసొంపుగా ఉంటూ పాట వెంటనే నచ్చేసేలా ఉంది. తమన్ జోరు చూస్తుంటే మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఛల్ మోహన్ రంగ చిత్ర రూపంలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20 లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమేనని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో ముక్కోణపు టీ20 టోర్నీ ఆడనుండటంపై స్పందించాడు. మరోవైపు మూడో మ్యాచ్‌లో గెలిచి టీమిండియా టీ20 సిరీస్‌ సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసాడు. మనీష్‌ పాండే, హర్ధిక్‌ పాండ్యలు భారత జట్టులో సెహ్వాగ్‌, హర్భజన్‌లా జట్టులో కీలక ఆటగాళ్ళుగా మారడానికి సమయం పడుతుందన్నాడు.