Short News

మోటో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, సొంతం చేసుకునేందుకు సదవకాశం

మోటో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, సొంతం చేసుకునేందుకు సదవకాశం

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో మోటో అభిమానులకు పండగసేల్ నిర్వహిస్తోంది. ఈ సంధర్భంగా ఎంపిక చేసిన మోటో ఫోన్లపై భారీ తగ్గింపును కంపెనీ అందిస్తోంది. కాగా. వాలెంటైన్స్ డే సందర్భగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. వాళ ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్‌లో భాగంగా నిర్వహిస్తున్న సేల్‌లో పలు మోటో ఫోన్లు భారీ తగ్గింపు ధరలకు వినియోగదారులకు లభ్యమవుతున్నాయి. వీటిల్లో మోటో లేటెస్ట్ మోడల్స్ కూడా ఉన్నాయి. డిస్కౌంట్ పొందే వివరాలపై ఓ లుక్కేద్దాం.

అదిరిపోయే ఫీచర్లతో హువావే నుంచి రెండు ఫోన్లు విడుదల

అదిరిపోయే ఫీచర్లతో హువావే నుంచి రెండు ఫోన్లు విడుదల

హువావే కంపెనీ పి20 సిరీస్ లో రెండు కొత్త మోడళ్లను మంగళవారం భారత మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ప్రీ 20 ప్రొ, ప్రీ 20 లైట్‌ పేరుతో రెండు స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచింది. ప్రీ 20 ప్రొ ధర ను రూ.64,999 గాను, పీ 20 లైట్‌ ధర 19,999 రూపాయలుగానూ కంపెనీ నిర్ణయించింది. పీ 20 ప్రో లో 6.1 అంగుళాల డిస్ ప్లే పొందుపర్చింది. 6జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజీ, 40+ 20+8 ఎంపీ ట్రిపుల్‌ రియర్‌ కెమెరా 24ఎంపీ సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఇక పీ 20 లైట్ లో 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ 16+2ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా, 24 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
ఎన్జీవో నేత అశోక్‌బాబు అనూహ్య వ్యాఖ్యలు...మళ్లీ యు టర్నా?

ఎన్జీవో నేత అశోక్‌బాబు అనూహ్య వ్యాఖ్యలు...మళ్లీ యు టర్నా?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నోటి వెంట అనూహ్యమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇప్పటివరకు ప్రత్యేక హోదాకు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం. పోరాటాల్లో పాల్గోవడం చేస్తున్న ఆయన హఠాత్తుగా పూర్తి భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కడప జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనా ఉద్యమం పూర్తిగా రాజకీయం అయిందని, ఎవరికి వారు ఉద్యమాలు చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రానికి పదేళ్లు హోదా కావాలని ఎవరు అడగలేదని గుర్తుచేశారు.

అల్లు అరవింద్ అలా చేయాలనుకున్నారు.. కానీ!

అల్లు అరవింద్ అలా చేయాలనుకున్నారు.. కానీ!

ఇటీవల అన్న పూర్ణ స్టూడియోస్ లో తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశమై తాజా పరిస్థితులని చర్చించిన సంగతి తెలిసిందే. రాంగోపాల్ వర్మ చేసిన నీచపు పనితో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. వర్మ కుట్రని మొదట బయటపెట్టిన వ్యక్తి అల్లు అరవింద్. ప్రెస్ మీట్ పెట్టి ఆయన వర్మని కడిగిపారేశారు.అల్లు అరవింద్ తీసుకువచ్చిన ప్రతిపాదనని కొందరు ప్రముఖులు వ్యతిరేకించారట. అన్నపూర్ణ బ్యానర్ లో భాగమైన సుప్రియ ప్రధానంగా అల్లు అరవింద్ ప్రతిపాదనని వ్యతిరేకించినట్లు తెలుస్తోంది.