Short News

నోకియా ఎక్స్‌6 విడుదల

నోకియా ఎక్స్‌6 విడుదల

హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా ‘ఎక్స్‌' సిరీస్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు చైనాలో విడుదల చేసింది. నోకియా ఎక్స్‌6 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. నాచ్‌ డిస్‌ప్లేతో వచ్చిన తొలి నోకియా స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. కేవలం ఈ స్మార్ట్‌ఫోన్‌కు నాచ్‌ డిస్‌ప్లేను అందించడమే కాకుండా... ఆల్‌-గ్లాస్‌ డిజైన్‌ను ఇది అందిస్తోంది. అదనంగా డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, స్నాప్‌డ్రాగన్‌ 636 చిప్‌సెట్‌ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.
వేషాల కోసం శరీరాన్ని అమ్ముకోవద్దు.. క్యాస్టింగ్ కౌచ్‌పై రవికిషన్

వేషాల కోసం శరీరాన్ని అమ్ముకోవద్దు.. క్యాస్టింగ్ కౌచ్‌పై రవికిషన్

సినీ పరిశ్రమలో లైంగిక దాడులు కేవలం ఆడవాళ్లకే పరిమితం కాదని, మగవాళ్లపై కూడా ఉంటాయని ప్రముఖ నటుడు రవి కిషన్ వెల్లడించారు. అయితే వాటికి అంతగా ప్రాధాన్యం ఇవ్వకూడదని ఆయన అన్నారు. అలాంటి వాటిని పట్టించుకొంటే కెరీర్‌ తీవ్ర ఇబ్బందిలో పడుతుందని ఆయన అన్నారు. వేషాల కోసం పడకగదికి వెళ్లే అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సినీ రంగంలో లైంగిక వేధింపులు తప్పక ఉంటాయి. వేషాల కోసం అమ్మాయిలను పడక గదిలో రమ్మనే సంస్కృతి ఉంది. ఇది ఈ రంగానికే పరిమితం కాదు అని రవి కిషన్ అన్నారు. ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన రవి కిషన్‌ ఇంటర్వ్యూ సంచలనంగా మారింది

సారా అలీఖాన్ పై కేసు నమోదు

సారా అలీఖాన్ పై కేసు నమోదు

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌పై దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ కేసు వేసారు. అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో సారా 'కేదార్‌నాథ్‌' అనే సినిమాతో తెరంగేట్రం చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. దాంతో దర్శకుడు రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న 'సింబా'లో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. అయితే ఒప్పందం ప్రకారం తన అనుమతి లేకుండా మరో సినిమాకు సంతకం చేసిందని అభిషేక్‌ సారాపై కేసు పెట్టారు. ఇందుకై రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఫిర్యాదు‌లో పేర్కొన్నారు.
తెలంగాణాలో టీడీపీ  ప్ర‌భావం చూపితే మ‌రో జేడీయ‌స్ కాగ‌ల‌దు..

తెలంగాణాలో టీడీపీ ప్ర‌భావం చూపితే మ‌రో జేడీయ‌స్ కాగ‌ల‌దు..

తెలంగాణ మ‌హానాడు సంద‌ర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణుల్లో చిరు ఆశలు రేకెత్తించారు. 2019 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీ టీడీపీ కీలకంగా మారుతుందని జోస్యం చెప్పారు. టీ టీడీపీ ఏర్పాటు చేసిన మహానాడు వేదిక నుంచి బాబు ఈ ప్రకటన చేశారు. పొరుగున కర్ణాట‌క జేడీఎస్ మాదిరిగా తెలంగాణలో టీ టీడీపీ పాత్ర ఉంటుందన్నది ఆయన భావన. కర్నాటకలో హంగ్ వచ్చి జేడీఎస్ కింగ్ అయినట్టు తెలంగాణలో కూడా హంగ్ వచ్చి టీ టీడీపీ కీలకం అవుతుందన్నది బాబు లెక్క. నిజంగా తెలంగాణలో అలా జరిగే అవకాశం ఉందా?

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more