Short News

మార్కెట్లోకి 'వ‌న్ ప్ల‌స్ 6' స్మార్ట్‌ఫోన్‌

మార్కెట్లోకి 'వ‌న్ ప్ల‌స్ 6' స్మార్ట్‌ఫోన్‌

వ‌న్ ప్ల‌స్ సంస్థ కొత్త స్మార్ట్‌ఫోన్ 'వ‌న్ ప్ల‌స్ 6'ను విడుద‌ల చేసింది. ఇందులో  6.29 ఇంచుల ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. అధునాత‌న స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ప‌వ‌ర్ ఫుల్ ర్యామ్‌ల‌ను ఇందులో అమ‌ర్చారు.  ఫోన్ వెనుక భాగంలో 16, 20 మెగాపిక్స‌ల్ కెమెరాల‌ను ఏర్పాటు చేసారు. వీటితో తీసుకునే ఫొటోలు, వీడియోలు క్వాలిటీని క‌లిగి ఉంటాయి. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆక్సిజ‌న్ ఓఎస్ 5.1 వెర్ష‌న్‌ను ఏర్పాటు చేసారు. ఫోన్ వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ను ఏర్పాటు చేసారు.
సొంత ఇళ్లు మరమ్మతులు చేసుకుంటున్న మాజీ సీఎంలు

సొంత ఇళ్లు మరమ్మతులు చేసుకుంటున్న మాజీ సీఎంలు

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు తక్షణమే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మాజీ సీఎంలు తమ ఇండ్లకు మరమ్మతులు చేయించే పనిలో పడ్డారు మాజీ ముఖ్యమంత్రులు. కేంద్రహోంమంత్రి, యూపీ మాజీ సీఎం రాజ్‌నాథ్ సింగ్ గోమ్తి నగర్‌లోని తన నివాసానికి మరమ్మతులు చేయడంతోపాటు మెరుగులు దిద్దిస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత రాజ్‌నాథ్ కాలిదాస్ మార్గ్ 4లో ఉన్న అధికారనివాసం నుంచి గోమ్తి నగర్‌లోని వ్యక్తిగత నివాసానికి మారునున్నారు. ఇక మిగతా మాజీ సీఎంలు కూడా తమ ఇండ్లను బాగు చేయించుకునే పనిలో పడ్డారు.
భార్య పేరును తప్పుగా ట్వీట్ చేసిన డొనాల్డ్ ట్రంప్

భార్య పేరును తప్పుగా ట్వీట్ చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణి పేరును పొరపాటుగా రాశారు. మెలానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వైట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. మన ఫస్ట్‌లేడీ మెలానీ మళ్లీ వైట్‌హౌస్‌కి రావడం సంతోషంగా ఉంది.. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నారు... మీ అందరి అభిమానానికి ధన్యవాదాలని ట్వీట్ చేశారు. అయితే మెలానియా పేరును మెలానీగా పేర్కొన్నారు.
దీంతో నెటిజన్లు దానిని స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారింది.

కథువా కేసులో నిందితుడి సంతకం మ్యాచ్ అవట్లేదు.!

కథువా కేసులో నిందితుడి సంతకం మ్యాచ్ అవట్లేదు.!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కతువా కేసులో ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన నిందితుడు విశాల్ జంగోత్రా సంతకానికి , అతడు పరీక్షా పత్రంలో పెట్టిన సంతకానికి మ్యాచ్ అవట్లేదని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్సెస్ లాబోలేటరి నివేదికలో పేర్కొంది. ఈ క్రైమ్ సీన్‌లో నిందితుడు విశాల్ లేనట్లుగా ఫోరెన్సిక్ విభాగం వెల్లడించింది. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను జమ్మూకశ్మీర్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫోరెన్సిక్ విభాగం అందజేసింది.