Short News

సూపర్ ఫీచర్స్ తో  రెడ్‌మీ 5 వచ్చేసింది.

సూపర్ ఫీచర్స్ తో రెడ్‌మీ 5 వచ్చేసింది.

షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 5ను బుధవారం విడుదల చేసింది. గతంలో విడుదలైన రెడ్‌మీ 4 ను మించిన పవర్‌ఫుల్ ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 5.7 ఇంచుల సైజ్ ఉన్న భారీ ఫుల్ వ్యూ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. అలాగే ముందు భాగంలో ఉన్న సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం ఇచ్చారు. ఫోన్ బాడీని మెటల్‌తో తయారు చేసినందున ప్రీమియం క్వాలిటీ లుక్ వచ్చింది. ఫోన్ వెన‌క భాగంలో ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. రెడ్‌మీ 4 క‌న్నా 11 శాతం త‌క్కువ‌ స్లిమ్ బాడీని ఈ ఫోన్ క‌లిగి ఉంది.
కథను నమ్ముకుని సినిమా తీయాలి

కథను నమ్ముకుని సినిమా తీయాలి

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన చిత్రం 'ఎమ్మెల్యే'-మంచి లక్షణాలున్న అబ్బాయి. ఉపేంద్ర మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌. మార్చి 23న విడుదలవుతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మంగళవారం రాత్రి నిర్వహించారు. వేడుకలో మాట్లాడిన కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ కథను నమ్ముకుంటే ఏదో ఒక రోజు సక్సెస్‌ వస్తుందని అన్నాడు. ఈ కార్యక్రమంలో శ్రీను వైట్ల, పోసాని, వంశీ పైడిపల్లి, బ్రహ్మానందం, భీమనేని శ్రీనివాసరావు, వి.ఎన్‌.ఆదిత్య, కోన వెంకట్‌ తదితరులతో పాటు చిత్రబృందం పాల్గొంది.
ముసుగు తొలగుతోందా?, పవన్ బీజేపీ సంధించిన బుల్లెట్టే: టీడీపీ

ముసుగు తొలగుతోందా?, పవన్ బీజేపీ సంధించిన బుల్లెట్టే: టీడీపీ

నిన్న మొన్నటిదాకా పవన్ ఏం మాట్లాడినా.. మనోడే అంటూ వెనకేసుకొచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పవన్ వ్యాఖ్యలను ఏమాత్రం ఉపేక్షించవద్దని, అవసరమైతే అతని బలహీనతలను బయటకు లాగాలని పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. పవన్ చేసిన అవినీతి ఆరోపణలు పార్టీకి బిగ్ డ్యామేజ్ చేశాయని ఆయన భావిస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయడం.. వాటిని బీజేపీ సమర్థించడం..

'రకుల్‌ ప్రీత్‌ సింగ్‌' యాప్ వాడుతున్నారా.!

'రకుల్‌ ప్రీత్‌ సింగ్‌' యాప్ వాడుతున్నారా.!

నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండటానికంటూ ప్రత్యేకంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరిట తన అధికారిక యాప్‌ను విడుదల చేసింది. అభిమానులతో మరింత ఇంటరాక్టివ్‌గా ఉండటానికే ప్రత్యేకంగా యాప్‌ పొడలుపెట్టినట్లు చెప్పింది. ఎవరు పెద్ద ఫ్యాన్‌ అనేది తెలుసుకోవడంతో పాటుగా అందరికీ తగిన సమాధానాలివ్వడానికి ఈ యాప్‌ తోడ్పడుతుందని తెలిపింది. ఈ యాప్ లో ఫ్యాన్స్‌ని ఉత్సాహపరిచే రీతిలో పలుఇ పోటీలు ఉంటాయి. ప్రస్తుతం 'హెలికాఫ్టర్‌ రైడ్‌ విత్‌ రకుల్‌' అనే పోటీ ప్రారంభమైంది.