Short News

'జియో ఫోన్ల'లో కూడా ఫేస్‌బుక్‌

'జియో ఫోన్ల'లో కూడా ఫేస్‌బుక్‌

జియో ఫోన్‌ వినియోగదారులకు రిలయన్స్ ప్రేమికుల దినోత్సవ కానుక తెచ్చింది. నేటి నుంచి జియో ఫోన్లలో ఫేస్‌బుక్‌ అందుబాటులోకి రానుంది. జియో యాప్‌ స్టోర్‌ ద్వారా హ్యాండ్‌సెట్లలో ఫేస్‌బుక్‌ను పరిచయం చేస్తున్నట్లు జియో డైరెక్టర్‌ ఆకాష్‌ అంబానీ తెలిపారు. జియో ఫోన్లలో ఉన్న 'జియో కై' ఓఎస్‌తో పనిచేసే కొత్త వెర్షన్‌ ఫేస్‌బుక్‌ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. 50 కోట్ల మంది జియో వినియోగదారులకు ఇది అందుబాటులోకి రానుంది.
బూట్లు, సాక్సులు నిషేధించిన బీహార్ పరీక్షల బోర్డు

బూట్లు, సాక్సులు నిషేధించిన బీహార్ పరీక్షల బోర్డు

బిహార్‌లో బోర్డు పరీక్షలు అంటేనే చర్చనీయమైన అంశంగా మారుతోంది. తాజాగా ఆ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి అధికార యంత్రాంగం నూతన నిబంధనలు తీసుకువచ్చింది. పరీక్షలకు బూట్లు, సాక్సులు వేసుకురావొద్దని ఆదేశాలు జారీ చేసింది. సాధారణ స్లిప్పర్స్‌ లేదా ఫ్లిప్‌ఫ్లాప్స్‌ వేసుకురావాలని సూచించింది. ఫిబ్రవరి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
అక్రమ సంబంధం: మహిళను చంపి తల, మొండెం వేరు చేశారు

అక్రమ సంబంధం: మహిళను చంపి తల, మొండెం వేరు చేశారు

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. జిల్లాలోని గూడూరు మండలం టేకులతండాలో ఈ సంఘటన శనివారంనాడు చోటు చేసుకుంది.

అక్రమ సంబంధమే ఆ మహిళ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్ారు. వినోద అనే ఆ మహిళను చంపిన వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

ఆమె మొక్కజొన్న చేను సమీపంలో ఉన్న పత్తి చేనులో వినోద రక్తం మడుగులో కనిపించింది. తల, మొండెం వేర్వేరుగా పడేశారు.

రెడ్‌మి నోట్ 5తో పోటీ పడే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

రెడ్‌మి నోట్ 5తో పోటీ పడే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

చైనా మొబైల్ దిగ్గజం షియోమి తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రెడ్‌మి నోట్ 5తో మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. అత్యంత తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ మీద ఆసక్తి లేనివారు వేరే ఫోన్లో ఇదే ఫీచర్లు ఉంటే బావుండునని ఆలోచిస్తుంటారు. అయితే అలాంటి వారికోసం మార్కెట్లో కొన్ని ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. రెడ్‌మి నోట్ 5తో పోటీపడే ఓ అయిదు ఫోన్లను మీకు పరిచయం చేస్తున్నాం. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.