Short News

ప్రతి నెలా 100 జిబి ఉచిత డేటాతో జియో ఫైబర్ బ్రాండ్ !

ప్రతి నెలా 100 జిబి ఉచిత డేటాతో జియో ఫైబర్ బ్రాండ్ !

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన జియో ఇప్పుడు బ్రాడ్ బాండ్ రంగంలో సత్తా చాటేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. బయటకొస్తున్న రిపోర్టుల ప్రకారం జియో ఫైబర్ నెట్ అతి త్వరలోనే దూసుకువస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం జియో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌కు చెందిన ఆస్తులను కొనుగోలు చేయడంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అయితే ఈ డీల్ పూర్తి కాగానే జియో ఫైబర్ లాంచ్ తేదీలను ప్రకటిస్తుందని అనధికార రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

చెత్తగా ఆడాం ..ముమ్మాటికీ తప్పు మాదే

చెత్తగా ఆడాం ..ముమ్మాటికీ తప్పు మాదే

టీ20 లీగ్ 2018లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయంపై ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఐపీఎల్‌ చరిత్రలో చెత్తరికార్డును నమోదుచేసిన ముంబై 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన నేపధ్యంలో రోహిత్ మాట్లాడుతూ 'ఓడిపోయినందుకు మమ్మల్ని మేము నిందించుకోవాల్సిందే. పిచ్‌ స్వభావం ఎలాంటిదైనా కావచ్చు. ఇంత చిన్న(118 పరుగుల) లక్ష్యాన్ని సునాయాసంగా ఛేధింగల సత్తా మా జట్టుకు ఉంది. బౌలర్లు అద్భుతంగా రాణించినా, బ్యాట్స్‌మన్లు దారుణంగా విఫలమయ్యారు. వ్యక్తిగతంగా నేను కూడా చెత్తగా ఆడానని చెప్పక తప్పదు' అని చెప్పాడు. 
భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌

భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌

దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ తన టవర్‌ యూనిట్‌ను ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌తో విలీనం చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 10.8 బిలియన్‌ డాలర్లు(రూ.71,500 కోట్లు). ఈ ఒప్పందంలో ప్రతి ఇండస్ టవర్ వాటాకి 1,565 షేర్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు భారతి ఎయిర్‌టెల్‌ రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించింది. తాజా డీల్‌తో చైనా వెలుపల భారత్‌లో అతిపెద్ద మొబైల్‌ టవర్‌ కంపెనీగా ఎయిర్‌టెల్‌ ఆవిర్భవిస్తుంది. విలీనం తరువాత ఉమ్మడి సంస్థ ఇండస్‌ టవర్స్‌ లిమిటెడ్‌గా కొనసాగనుంది.  
తెదేపా నేత ఆనం వివేకానందరెడ్డి అస్తమయం

తెదేపా నేత ఆనం వివేకానందరెడ్డి అస్తమయం

తెలుగుదేశం పార్టీ నేత, నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి(67) బుధవారం కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1950 డిసెంబర్‌ 25న నెల్లూరులో జన్మించిన ఆయన వీఆర్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసారు. మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. రేపు నెల్లూరులో వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.