Short News

విధిని జయించిన వీరుడు ఏలియన్స్ మీద చెప్పిన ఆసక్తికర విషయాలు

విధిని జయించిన వీరుడు ఏలియన్స్ మీద చెప్పిన ఆసక్తికర విషయాలు

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అటువంటి స్థితిలో మరో వ్యక్తి అయితే ఎప్పుడో కుప్పకూలిపోయేవాడు. కానీ ఆయన తన మొక్కవోని ధైర్యంతో మనుగడ సాగించడమే కాకుండా ప్రపంచం మర్చిపోలేని పరిశోధనలు చేశాడు. మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా కూడా ఆయన ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు చేసి విశ్వవిఖ్యాతి గడించారు. విధి వెక్కిరస్తుంటే దానికి ఎదురొడ్డి అమేయమైన ఆత్మవిశ్వాసంతో ఆయన ముందుకు సాగారు.

ఎడ్డేమంటే తెడ్డెం: డిజిటల్ చెల్లింపులకు సర్కార్ సహకారం

ఎడ్డేమంటే తెడ్డెం: డిజిటల్ చెల్లింపులకు సర్కార్ సహకారం

డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి కేంద్రం చర్యలు ప్రతిపాదిస్తూ ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంపై ఎడాపెడా ఫీజు వసూలు చేస్తున్నాయి.చెక్‌కు సరిపడా బ్యాంకు ఖాతాలో నగదు లేకపోతే సంబంధిత ఖాతాదారుడిపై భారీగా జరిమానా వడ్డిస్తున్నాయి బ్యాంకులు. కనుక బ్యాంకుల నుంచి వచ్చిన ఎస్సెమ్మెస్‌ల ఆధారంగా లావాదేవీలు జరుపాలని కోరుతున్నారు.ఇక ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులు జారీ చేసిన చెక్కులు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి చెల్లబోవని తేల్చేసింది.

మళ్లీ సెక్యూరిటీ అడ్వైజర్‌ను మార్చిన ట్రంప్

మళ్లీ సెక్యూరిటీ అడ్వైజర్‌ను మార్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాంపౌండ్ లో అధికారుల,సలహాదారుల మార్పుల పరంపర కొనసాగుతోంది. ఆయన ఎన్‌ఎస్‌ఏ చీఫ్ హెచ్‌ఆర్ మెక్‌మాస్టర్‌ను మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో జాన్ బోల్టన్‌ను ట్రంప్ నియమించారు. ఏప్రిల్ 9న బోల్టన్ బాధ్యతలు స్వీకరిస్తారు. మెక్‌మాస్టర్ తనకు ఓ ఫ్రెండ్ అని, అద్భుతమైన ఉద్యోగం చేశారని ట్రంప్ మెచ్చుకున్నారు. దేశాధ్యక్షుడికి ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉందని బోల్టన్ తెలిపారు. ట్రంప్‌కు సెక్యూరిటీ అడ్వైజర్ మారడం గత 14 నెలల్లో ఇది మూడవ సారి.
రూ.10కే జియో డీటీహెచ్, జీవితాంతం ఆ ఛానల్స్ ఉచితం..?

రూ.10కే జియో డీటీహెచ్, జీవితాంతం ఆ ఛానల్స్ ఉచితం..?

ఇండియన్ టెలికం మార్కెట్లో జియో జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మొబైల్ నెట్‌వర్క్ విభాగంలో ఈ టెల్కో రాణిస్తోన్న తీరు విప్లవాత్మక పోకడలకు దారి తీస్తోంది.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో జియో అందిస్తోన్న టెలికామ్ సేవలు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా మారటంతో జియో దూకుడు ఇప్పుడప్పుడే తగ్గేటట్టు కనిపించటం లేదు. మొబైల్ నెట్‌వర్క్ విభాగంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్న జియో డీటీహెచ్ సేవల పై ఫోకస్ చేస్తోన్న విషయం తెలిసిందే.